Friday, 19 June 2026 03:13:11 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్

మరో 34 మంది వైద్యులు రాజీనామాల సమర్పణ

Date : 18 June 2026 08:19 PM Views : 31

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి - జూన్ 18 : ప్రభుత్వ వైద్య సేవలకు దూరంగా అనధికారికంగా విధులకు గైర్హాజరీలో ఉన్న 43 మంది వైద్యుల ( సివిల్ అసిస్టెంట్ సర్జన్ ) లపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. గరిష్టంగా నాలుగేళ్ల నుంచి విధులకు రాకుండా ఉన్న వీరికి నిబందనలు అనుసరించి సంజాయిషీ నోటీసుల జారీతోపాటు అభియోగాలు నమోదుచేసినప్పటికీ స్పందన లభించనందున విధుల నుంచి శాశ్వతంగా తప్పించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన జారీచేశారు. గతనెలలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యుల్లో 51 మంది అనధికారికంగా విధులకు దూరంగా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి తప్పించారు. ఇదేవిధంగా ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోనూ జరిగేందుకు అవసరమైన చర్యలు తుదిదశకు చేరుకున్నాయి. వీరిలో జనరల్ మెడిసిన్,ఆర్థో, గైనిక్ ఇతర వైద్యులు ఉన్నారు మరో 34 మంది రాజీనామాల సమర్పణ వాస్తవానికి 118 మంది పర్మినెంట్ వైద్యులు అనధికారికంగా విధులకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏడాదికి మించి అనధికారికంగా విధులకు దూరంగా ఉంటే విధుల నుచి తప్పించవచ్చు. వీరిపై ప్రభుత్వ నిబంధన అనుసరించి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే 43 మంది వైద్యులను శాశ్వతంగా విధుల నుంచి తప్పించే ప్రక్రియ మొదలైంది. ఈ 43 మంది కాకుండా మరో 34 మంది వైద్యులు సంజాయిషీ నోటీసులు జారీ, అభియోగాల నమోదు అనంతరం రాజీనామాలు చేశారు. వీరిలో 15 మంది రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించబోతుంది. అభియోగాల నమోదు అనంతరం మిగిలిన 19 మంది రాజీనామాలు చేసినందున క్రమశిక్షణ (సీసీఏ రూల్సు-1991) చర్యల్లో భాగంగా జిల్లాల వారీగా 11 మంది విచారణ అధికారులను నియమించారు. వీరి సదరు వైద్యుల నుంచి వివరణ కోరి, ఇచ్చే నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబ వెల్లడించారు. అభియోగాల నమోదు అనoతరం మరో 19 మంది వైద్యులు వ్యక్తిగత కారణాలవల్ల విధులకు హాజరుకాలేదని వివరణ ఇచ్చారు. దీనిపై విచారణ జరగనుంది. సంజాయిషీల నోటీసులు జారీ జరిగిన తర్వాత 9 మంది CASlu విధుల్లో చేరారు. మరో 13 మంది వైద్యుల అభ్యర్ధనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: