Monday, 14 September 2026 07:27:39 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం చిత్తశుద్ధిలో పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

Date : 05 November 2025 07:02 PM Views : 213

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం చిత్తశుద్ధిలో పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... కొనియాడిన మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ -- PPP విధానం పేదలకు వైద్యం దూరం... కోటి సంతకాలతో కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపిద్దాం -- మదనపల్లె మున్సిపాలిటీ 4, 21 వార్డులలో కోటి సంతకాల రచ్చబండలో నిస్సార్ అహమ్మద్... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాదాన్యతనిచ్చి సంక్షేమ, అభివృద్ధి పధకాలు తెచ్చారని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. ‌బుధవారం మదనపల్లె మున్సిపాలిటీ 4, 21 వార్డులలో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ‌ఈ కార్యక్రమంలో నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలు అధికంగా వున్నారు, కాబట్టి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిపారని, దీనికి కారణం మీరే అని, అందరూ ఐక్యంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సిఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ‌ముస్లిం సమాజానికి చేయూత ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి బాటలో నడుస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పధకాలు అందించడం జరిగిందని వివరించారు. ‌ముస్లిం యువత విద్య పై దృష్టి పెట్టాలని తద్వారా సమాజంలో గౌరవం పెరగడం, చెడు వ్యసనానికి దూరంగా వుంటారని వివరించారు. ‌ మెడికల్ కాలేజీల‌ ప్రయివేటీకరణ ద్వారా పేదలకు వైద్యం అందక పోవడం తోపాటు పేద విద్యార్థులకు వైద్య విద్యం దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ‌PPP విధానానికి వ్యతిరేకంగా ప్రతిఒక్కరూ సంతకం చేసి తమ వ్యతిరేకత వెల్లిబుచ్చాలని పిలుపునిచ్చారు. ‌రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్‌ కళాశాలలను తీసుకువచ్చారని వివరించారు. వాటిని ప్రైవేటుపరం చేసేందుకు సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. దీని వల్ల పేద విద్యార్థులకు వైద్యవిద్య దూరమవుతుందన్నారు. మెడికల్‌ కళాశాలలను రక్షించుకుంటేనే భవిష్యత్తులో పేదల పిల్లలు డాక్టర్ల అవుతారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని భ్రష్టుపట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, ఇప్పటికే ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో పెట్టిన కారణంగా సేవలు చాలా మందికి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‌ముఖ్యంగా ప్రతి ఒక్కరూ PPP విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, మీ పిల్లలు డాక్టర్లు కావాలంటే కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ముడుపుల కోసమే మెడికల్‌ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. 17 మెడికల్‌ కళాశాలలు రాష్ట్రానికి తేవడమన్నది ఒక చరిత్ర అని, అది జగన్మోహన్ రెడ్డి సృష్ఠించాడన్నారు. అవి పూర్తయితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కి పేరుప్రతిష్ఠలు వస్తాయో అన్న కుతంత్రంతోనే మెడికల్‌ కళాశాలలను పీపీపీ అంటూ ప్రైవేటు పరం చేసేస్తున్నారన్నారు‌. సంపద సృష్ఠి అంటే వేలల్లో ఖర్చుపెట్టి చదివే విద్యార్థులు లక్షల్లో ఖర్చుపెట్టి చదివేలా చెయ్యడమేనా అని ప్రశ్నించారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ వైద్యశాలల కోసం వైసిపి చేస్తున్న పోరాటంలో ప్రతిఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు షమీమ్ అస్లాం, వైస్ చైర్మన్లు జింకా చలపతి, నూర్-ఆజం, ఖాజా , రఫీ, రాజేష్, సుధాకర్, రమేష్, ఎన్. ఇర్ఫాన్ ఖాన్, ఇర్ఫాన్ షేక్, యూనస్, శ్రీనివాసులు, ఆంజనేయులు, మహేష్, మల్లికార్జున, ఎన్. నవాజ్ పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: