నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లెలో మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ కు ఘన స్వాగతం. తంబళ్లపల్లె ఫిబ్రవరి 15 ( నమిత న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ అన్నమయ్య) ః తంబళ్లపల్లె లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ కు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. క్రాస్ రోడ్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ పూలమాలలు, దృశ్యాలవులతో సన్మానించడానికి నాయకులు పోటీపడ్డారు. సీఎం చంద్రబాబు వర్ధిల్లాలి,శంకరన్న నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. క్రాస్ రోడ్ నుండి పాత బస్టాండ్ వరకు వేలాదిమంది కార్యకర్తల మధ్య ఊరేగింపుగా తరళి వచ్చారు. మండల కేంద్రం టిడిపి నాయకులు, వాహన ర్యాలీతో తంబళ్లపల్లె జనాలతో కిటకిటలాడింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే భారీ ర్యాలీగా మల్లయ్య కొండ చేరుకుని మహా శివుని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తంబళ్లపల్లె ప్రజలు పాడిపంటలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించినట్లు చెప్పారు. *పెద్దాయన మాటే నాకు శిరోధార్యం*ః సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలే నాకు శిరోధార్యమని నాడు టిడిపి ప్రభుత్వంలో తంబళ్లపల్లె నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని గత వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమని నేడు మన కూటమి ప్రభుత్వం లో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పరుగులు పెడుతున్నట్లు చెప్పారు. నా మీద అభిమానంతో తరలివచ్చిన టిడిపి శ్రేణులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ నా చివరి శ్వాస వరకు ప్రజాసేవకే అంకితమని తెలిపారు. ఆయన వెంట టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసులు, సిద్ధమ్మ,పురుషోత్తం,మాజీ జెడ్పిటిసి రామచంద్ర, పార్లమెంట్ రైతే భాగం అధ్యక్షుడు వెంకటరెడ్డి ,వీరాంజనేయులు,బిఎంఆర్, దండువారిపల్లి రమణ, ఎర్రసానిపల్లి సుధాకర్, కన్నె మడుగు సురేంద్ర, నరసింహులు, కాలా నారాయణ, మదనమోహన్, మాజీ సర్పంచులు సుధాకర్, శంకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News