Thursday, 30 July 2026 11:52:58 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఇంజినీరింగ్ అంతర కళాశాలల క్రీడల పోటీలలో సత్తాచాటిన మిట్స్ విద్యార్థులు

Date : 09 May 2026 05:50 PM Views : 109

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె -మే 09 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు కడపలోని కేఎస్ఆర్‌ఎమ్ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన “కేఎస్ఆర్‌ఎమ్ అంతర్ ఇంజినీరింగ్ కళాశాల క్రీడా పోటీలు – 2026” లలో విశేష ప్రతిభ చూపారని ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. వివిధ కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలలో మిట్స్ యూనివర్సిటీ మహిళా జట్లు వాలీబాల్ మరియు టెన్నికాయిట్ విభాగాలలో ద్వితీయ స్థానాలను సాధించారని తెలిపారు . వాలీబాల్ విభాగంలో రూ.5,000 నగదు బహుమతి, టెన్నికాయిట్ విభాగంలో రూ.1,500 నగదు బహుమతిని గెలుచుకున్నారు. ఈ విజయంతో విద్యార్థినుల కృషి, క్రమశిక్షణ, జట్టు భావన మరియు క్రీడాస్ఫూర్తి ప్రతిఫలించిందని అన్నారు . ఈ పోటీలలో ఈసీఈ, డేటా సైన్స్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ విభాగాలకు చెందిన విద్యార్థినులు విశేష ప్రతిభ కనబరిచారు. క్రీడా రంగంలో విద్యార్థులను నిరంతరం ప్రోత్సహిస్తూ సహకారం అందిస్తున్న మిట్స్ యూనివర్సిటీ యాజమాన్యానికి ఫీజికల్ డైరెక్టర్ డాక్టర్ సి. దామోదరన్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, ఫీజికల్ డైరెక్టర్ డాక్టర్ సి. దామోదరన్ విభాగాధిపతులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :