Monday, 14 September 2026 08:38:42 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె లో టిడిపి కి పూర్వ వైభవం తీసుకువస్తా - సుగవాసి ప్రసాద్ బాబు

Date : 19 December 2025 07:58 PM Views : 395

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 19 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన టిడిపి నాయకులు, కార్యకర్తల సహకారంతో పూర్వ వైభవం తీసుకువస్తానని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు హామీ ఇచ్చారు. శుక్రవారం తంబళ్లపల్లె మండల నాయకులు టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రసాద్ బాబును దృశ్యాలవులు, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీ దుస్థితిపై ఆయనకు కూలంకషంగా వివరించారు. తెలుగుదేశం పార్టీ కోసం నాయకులు, కార్యకర్తలు గత ఐదేళ్ల వైకాపా అరాచక పాలనలో ఇసుక, మైనింగ్, భూ దోపిడి పై నిలదీస్తే మాపై దౌర్జన్యాలు, అక్రమకేసులు బనాయించినా ఎదురొడ్డి నిలిచి అన్ని రకాలుగా కార్యకర్తలు నష్టపోయినట్టు చెప్పారు. నేడు పార్టీ అధికారం వచ్చినా మా పనులు జరగలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు తంబళ్లపల్లె లో పార్టీని నడిపించే నాయకుడు లేక అనాధగా మిగిలిపోయామని వాపోయారు. దీనిపై స్పందించిన ప్రసాద్ బాబు ఎవరూ అధైర్య పడాల్సిన పనిలేదని పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో న్యాయం జరుగుతుందని తంబళ్లపల్లెకు దీటైన నాయకత్వం వస్తుందని మీకు ఏ సమస్య వచ్చినా పార్టీ అండగా ఉంటుందని 24 గంటలు మీకు అందుబాటులో ఉంటానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం లో జరిగిన అభివృద్ధిని నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో ప్రతి గడపకు చేర్చాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాను తరిమి కొట్టాలని సూచించారు. ఆయన వెంట టిడిపి నాయకులు తెలుగుదేశం యువ నాయకుడు పురుషోత్తం , తెలుగుదేశం సీనియర్ తెలుగుదేశం నాయకుడు వెంకటరమణ ,యువగళం మనిగే బాలాజీ నాయుడు, బీసీ నాయకుడు సీనియర్ తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నరసింహులు, వీరాంజనేయులు,బాలకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శంకర, మైనార్టీ నాయకుడు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :