Monday, 14 September 2026 11:35:39 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్. నిధులతో తంబళ్లపల్లె అభివృద్ధికి శ్రీకారం - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

అభివృద్ధి పనులను పర్యవేక్షించిన కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 26 March 2026 08:40 PM Views : 323

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 26 ః తంబళ్లపల్లె నియోజకవ ర్గ అభివృద్ధిలో భాగంగా రూ 4.20 కోట్లతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పర్యవేక్షించారు.గురువారం ఆయన తంబళ్లపల్లెలోని శ్రీనివాస కాలనీలో రూ 36 లక్షల తో నిర్మించిన సీసీ రోడ్ల పనులను నిశితంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.సి సి రోడ్లు నిర్మాణం తో పాటు డ్రైనేజీ పనులు చేపట్టాలన్నారు. సిసి రోడ్ల నిర్మాణ పనులలో నాణ్యత లోపించకుండా చూడాలని హెచ్చరించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద రూ 35 లక్షలతో నిర్మాణం చేపట్టిన సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మాణపు పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థలో నీరు నిలవ లేకుండా సజావుగా ప్రవహించేలా ప్రతి ఇంటి పైప్ కనెక్షన్లు డ్రైనేజీకి అనుసంధానం చేయాలని సూచించారు. డ్రైనేజీలో చెత్త చేరకుండా ఐరన్ మెష్ ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్ రోడ్డును 3.75 మీటర్ల నుండి 5.5 మీటర్ల విస్తరించి ఇంటర్మీడియట్ రోడ్డు గా మార్చే ప్రతిపాదనలు ప్రారంభించాలన్నారు. బస్సుల రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలన్నారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సీసీరోడ్ల నిర్మాణం తో పాటు గతంలో నిర్మించిన కాలవలపై మూతలు లేక ఇబ్బందులు పడుతున్నామని, బస్టాండ్ రోడ్లో విద్యుత్ స్తంభాలు పక్కకు తప్పించాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపాధి హామీ అనుసంధాన నిధులతో గ్రామీణ రవాణా, డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు మౌలిక వసతుల పనులను పి ఆర్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారుల సమన్వయంతో వేగవంతం చేసి నాణ్యత ప్రమాణాలతో మార్చి 31 వతేదీ లోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని అదేవిధంగా తాగునీరు వనరుల నీటి పరీక్షలను నిర్వహించాలని డిపిఓ రాధమ్మను ఆదేశించారు

ఎఫ్ పి ఓ కేంద్రం రైతుల ఆర్థిక అభివృద్ధికి చేయూత ః. రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సంఘం కేంద్రం రైతులకు దళారి వ్యవస్థ లేకుండా మెరుగైన ధరలతో ఆర్థిక అభివృద్ధికి ఊతంగా నిలుస్తుందని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఆయన తంబళ్లపల్లె ఎఫ్ పి ఓ కేంద్రాన్ని పరిశీలించి ఈ కేంద్రం ద్వారా రైతుల నుండి నేరుగా హార్టికల్చర్ పంటలను సేకరించి, గ్రేడింగ్ నాణ్యమైన ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేయడం ద్వారా రైతులకు మెరుగైన ధరలు లభిస్తాయి అన్నారు. ఈ ఎఫ్ పి ఓ కేంద్రాలు గ్రామస్థాయిలో రైతుల సంఘాలుగా ఏర్పరిచి బలోపేతం చేస్తే భవిష్యత్తులో రైతుల పంటలకు గిట్టుబాటు ధర తో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారన్నారు.ఈ సందర్భంగా టిడిపి నేతలు తులసి ధర్నాయుడు, నరసింహులు, ఆదిరెడ్డి, వెంకటరమణ, చంద్రశేఖర్, రామాంజులు, ఐసుల కృష్ణ లు తాసిల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుందని, ఆసుపత్రిలో డాక్టర్ల సమస్య ఉందని, పంచాలమర్రిలో పంచాయతీ భవన నిర్మాణం ఆగిందని,ఇంకా పలు సమస్యలు ఫిర్యాదు చేశారు.ఆయన వెంట పి ఆర్ ఈ ఈ చంద్రశేఖర్ రెడ్డి, డిఈ మునిరాజ్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏఈ లు వినోద్ కుమార్, సురేంద్ర, వెంకటరమణ, సుజాత,ఏపిఎం గంగాధర్, ఏపీఓ అంజనప్ప, ఎంఈఓ త్యాగరాజు, సిడిపిఓ సుజాతలు పాల్గొనగా యస్.ఐ. అనిల్ కుమార్ బందోబస్తు నిర్వహించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: