నమిత న్యూస్ - Andhra Pradesh / గుంటూరు : గుంటూరు - ఫిబ్రవరి 26 : గుంటూరు మిర్చి యార్డులో అన్నదాతలకు గురువారం నుంచి ఉచిత భోజన పథకం అమల్లోకి రానుంది. టెండర్ల ఖరారు లో జాప్యం వల్ల ఈ ఏడాది పథకం ఆలస్యమైంది. పాలకవర్గం, అధికారులు టెండరు ఖరారు చేసి గుత్తేదారుతో రూ 88/- భోజనం ను రూ 25/- లకు అల్పాహారం రూ 25/- లకే పెట్టేలా ఒప్పించారు. ఆల్పాహారానికి రూ. 20/- భోజనానికి రూ. 25/- గురువారం ఉదయం 11. 30 గంటలకు యార్డు చైర్మన్ కుర్రా అప్పా రావు, కార్యదర్శి చంద్రిక పథకాన్ని ప్రారంభించారు . డైనింగ్ హాలును శుభ్రం చేయించారు. వంట సామగ్రి, ప్రిజ్ను సిద్ధం చేశారు. శుక్రవారం నుండీ అల్పాహారం కూడా అందుబాటులోకి తీసుకొస్తారని వెల్లడించారు
Admin
Namitha News