నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే25: శనివారం ఉదయం మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది.ఈ జనరల్ బాడీ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు.నూతన కమిటీ గౌరవాధ్యక్షులు తోపు కృష్ణప్ప గౌరవ సలహాదారులు మురళి, సాంబశివ అధ్యక్షుడు ఎస్.మస్తాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు, ఉపాధ్యక్షుడు మిఠాయి శ్రీనివాసులు, ఇంద్రాణి, సాంబశివ నాయక్,పి.నరసింహులు, కార్యదర్శి. చలపతి నాయుడు ఆర్గనైజింగ్ కార్యదర్శి దేవా ప్రచార కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి, నర్సింహులు సహయ కార్యదర్శి. జానకీ, రాధా, కె.కృష్ణప్ప కోశాధికారి.చంద్ర, శంకర్,లను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శిలు మస్తాన్, చలపతి నాయుడు మాట్లాడుతూ మా ఎన్నికకు సహకరించిన ఏఐటీయూసీ నాయకులకు, కార్మికులకు అభినందనలు తెలిపారు.కార్మిక సమస్యలపై పోరాటాలు చేపడతామన్నారు .
Admin
Namitha News