నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 22 : రేపు సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పిజిఆర్ఎస్) కార్యక్రమం మదనపల్లి పట్టణం లో నూతన జిల్లా పోలీసు కార్యాలయం లోనే నిర్వహిస్తామని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పిర్యాదు దారులు నేరుగా విన్నవించుకునేందుకు వీలుగా, ఆధునిక వసతులతో కూడిన ఈ నూతన కార్యాలయం లోనే ఇకపై ప్రతి సోమవారం ఫిర్యాదుల స్వీకరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారు స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు జారీ చేస్తారని, కావున ఫిర్యాదుదారులు ఈ మార్పును గమనించి నూతన కార్యాలయానికి రావాలని కోరడమైనది
Admin
Namitha News