నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - జూలై 21 : రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రములో రిజిస్ట్రేషన్ వ్యవస్థలో తెచ్చిన GO NO 396 నూతన విధానానికి వ్యతిరేకిస్తూ జీవోను రద్దు పరచాలని ఆత్మకూరులో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రైటర్స్, స్టాంప్ వెల్డర్స్ ఆందోళన చేపట్టారు.. రాష్ట్రవ్యాప్తంగా తమ యూనియన్ పిలుపుమేరకు పది రోజుల పాటు పెన్‌డౌన్ కార్యక్రమం చేపడుతూ నేడు ఆత్మకూరు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయ సబ్ రిజిస్టర్ కు తమ సమస్యతో కూడిన వినతిపత్రం అందించారు..ఈ వృత్తి పై ఏళ్ల తరబడి ఆధారపడి కుటుంబ పోషణ చేసుకుంటూ జీవిస్తున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న నూతన ప్రైవేటీకరణ విధానంతో తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజల ఆస్తులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉందని వారు తెలుపుతూ వెంటనే జీవో 396 ను రద్దు పరచాలని నినాదాలు చేశారు.. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణంలోని డాక్యుమెంట్ రైటర్లు G V కోటేశ్వర రావు, సయ్యద్ ఖాజా రంతుల్లా, G s హరీష్ నాయుడు, కోడూరు పెంచలయ్య, మీసాల గణేష్, V.వెంకటేశ్వర్లు, M.రమేష్ మరియు స్టాప్ వెల్డర్స్ పాల్గొన్నారు
Reporter
Namitha News