Monday, 14 September 2026 06:55:05 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి

గ్రంధాలయ అధికారిణి ఆధ్వర్యంలో అతిథులకు ఘనసన్మానం

Date : 06 June 2026 06:22 PM Views : 132

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి - గ్రంధాలయ అధికారిణి ఆధ్వర్యంలో అతిథులకు ఘనసన్మానం మదనపల్లె : గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం లభిస్తుందని వక్తలు పేర్కొన్నారు.శనివారం గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంత కుమారి ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరం అట్టహాసంగా ముగిసింది.ఈ కార్యక్రమానికి ఆర్.ఎం.ఓ డాక్టర్ రాధిక,టీఎస్ఏ కృష్ణమూర్తి,జనార్ధన్ రెడ్డి,వై.ఎస్.మునిరత్నమయ్య,కామకోటి ప్రసాద్ రావు,గొల్లపూడి తిరుపతి రావు,విశ్రాంత ఉపాధ్యాయులు రెడ్డెప్ప,హేమలత,డాక్టర్,భవాని దేవి,లింగాల యుగంధరాచారి,పి.ఎం.నాగరాజు,నంద కిశోర్,జగన్మోహన్,చక్రవర్తి,విద్యాసాగర్ సిబ్బంది జయమ్మ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్.ఎం.ఓ డాక్టర్ రాధిక మాట్లాడుతూ ప్రస్తుతం సెల్ ఫోన్,టివి,సామాజిక మాధ్యమాలకు అలవాటు పడి విద్యార్థులు పుస్తక పఠనాన్ని వదిలేస్తున్నారన్నారు.గ్రంధాల యాలలో అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని,గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుంటే మేథోసంపత్తిని పెంపొందించుకోవడంతోపాటు ఉద్యోగ సాధన సులభతరమవుతుందన్నారు.అనంతరం వై.ఎస్ మునిరత్నం,జనార్దన్ రెడ్డిలు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాల గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి ఆదేశాల మేరకు ఏప్రిల్ 28 నుండి జూన్ 6వరకు గ్రంథాలయ వేసవిజ్ఞాన శిబిరం అద్భుతంగా సాగిందన్నారు.స్పోకెన్ ఇంగ్లీష్,వ్యాసరచన,డ్రాయింగ్,యోగా,చిత్రలేఖనం,మానవతా విలువలు వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.నాడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గ్రంథాలయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని,నేడు గ్రంథాలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.వేసవిజ్ఞాన శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేసిన గ్రంథాలయ అధికారిణి వసంత కుమారిని అభినందిస్తూ,సహకరించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.ఇందులో భాగంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.అనంతరం వేసవి విజ్ఞాన శిబిరంలో భాగస్వాములైన ఉపాధ్యాయులు,అతిథులను గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంతకుమారి శాలువాలతో ఘనంగా సత్కరించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :