Monday, 14 September 2026 07:35:03 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

నాదెళ్ల లక్ష్మీ రాజ్యం గారి అకాల మరణం పట్ల మిట్స్ యూనివర్సిటీ లో ఘన నివాళులు

యూనివర్సిటీ లో ఉపాధ్యాయ, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు ప్రగాఢ సంతాపం

Date : 02 June 2026 05:00 PM Views : 216

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 02 : మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వ్యవస్థాపకులు మరియు ఛాన్సలర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి గారి సతీమణి, ఆర్.ఆర్.ఆర్. ఎడ్యుకేషనల్ అకాడమీ ట్రెజరర్ శ్రీమతి నాదెళ్ల లక్ష్మీ రాజ్యం గారి అకాల మరణం పట్ల విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసినట్లు మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాదెళ్ల లక్ష్మీ రాజ్యం గారు విద్యా, సేవా కార్యక్రమాల పట్ల ఎల్లప్పుడూ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ, మానవతా విలువలను ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె మరణం యూనివర్సిటీ కుటుంబానికి తీరని లోటని అన్నారు. ప్రజల సందర్శనార్థం శ్రీమతి నాదెళ్ల లక్ష్మీ రాజ్యం గారి పార్థివ దేహాన్ని బుధవారం ఉదయం 10.00 గంటల నుండి మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ప్రాంగణంలోని నాదెళ్ల పెద్దప్ప నాయుడు బ్లాక్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు అభిమానులు ఆమెకు తమ అంతిమ నివాళులు అర్పించాలని కోరారు. అలాగే, శ్రీమతి నాదెళ్ల లక్ష్మీ రాజ్యం గారి అకాల మరణం నేపథ్యంలో బుధవారం (03-06-2026) యూనివర్సిటీకి సెలవు దినంగా ప్రకటించినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :