నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 08 : తంబళ్లపల్లె మండలంలో మంజూరైన జీవన్ మిషన్ ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణపు పనులు జోరందుకున్నాయి. మంగళవారం మండలం కొట్టాల పంచాయతీలోని జరిపాటి దీన్నే గ్రామంలో నిర్మిస్తున్న పదివేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణపు పనులను ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ట్యాంకు నిర్మాణపు పనులలో నాణ్యత లోపం లేకుండా చూడాలని, నిర్మాణం పనులు వేగవంతం తో పాటు పారదర్శకంగా పనులు చేపట్టాలని ట్యాంకు నిర్మాణపు పనులలో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని సదరు కాంట్రాక్టర్లను హెచ్చరించారు. అదేవిధంగా ఆర్ఎన్ తాండ, గోపి దీన్ని పంచాయతీలలో ట్యాంకు నిర్మాణపు పనులతో పాటు తంబళ్లపల్లెలో నిర్మిస్తున్న మరుగుదొడ్లు నిర్మాణాలను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మండలంలో తాగునీటి ఎద్దడి నివారణకు ఆర్డబ్ల్యూఎస్ డి ఈ అమరనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మారుమూల గ్రామాలలో ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంకుల తో నీటిని తరలించి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు విలేకరులకు తెలిపారు. ఆయన వెంట టిడిపి మండల బీసీ నాయకుడు పురుషోత్తం, గోపి దీన్ని మాజీ సర్పంచ్ సుధాకర్, జనసేన మండల నాయకుడు ఎద్దుల నరసింహులు, కూటమి నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News