నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మై భారత్ పోర్టల్‌లో జిల్లా యువత నమోదు విస్తృతంగా చేపట్టాలి - అవకాశాల కల్పనలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి - జిల్లా ఇంఛార్జి కలెక్టర్ శివ నారాయణ శర్మ పిలుపు అన్నమయ్య జిల్లాలో అర్హులైన యువతను పెద్దఎత్తున మై భారత్ పోర్టల్‌లో నమోదు చేయించేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శివ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు.సోమవారం మదనపల్లి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో మై భారత్ కేంద్రం - యువ అంశంపై జిల్లా సలహా మండలి సమావేశం ఇన్చార్జి కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు మై భారత్ పోర్టల్ ఒక ముఖ్యమైన వేదికగా పనిచేస్తోందన్నారు.జిల్లాలోని యువతకు ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వ పథకాలు,స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు,నైపుణ్యాభివృద్ధి,నాయకత్వ వికాసం,జాతీయ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.జిల్లాలో నిర్వహిస్తున్న మై భారత్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విద్య,యువజన,నైపుణ్యాభివృద్ధి,గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి యువకుడిని,యువతిని పోర్టల్‌లో నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం జిల్లా యువజన అధికారి దీపక్ జేమ్స్ మాట్లాడుతూ మై భారత్ పోర్టల్ ద్వారా యువతకు స్వచ్ఛంద సేవా అవకాశాలు,నైపుణ్యాభివృద్ధి శిక్షణలు,నాయకత్వ వికాస కార్యక్రమాలు,ఉపాధి మరియు జాతీయ స్థాయి యువజన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు లభిస్తాయని వివరించారు.ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి,డీఆర్‌ఓ వెంకటేష్,కెఆర్‌సీసీ ఎస్‌డీసీ చంద్రశేఖర్ రెడ్డి,జిల్లా సలహా మండలి సభ్యులు,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు
Reporter
Namitha News