Sunday, 13 September 2026 05:40:06 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ లో అల్యూమిని మీట్

Date : 31 January 2026 08:24 PM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 31 : సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో అల్యూమిని మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ నందు చదువుకున్న పూర్వ విద్యార్థులు హాజరైనారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధిలో మరియు ప్రస్తుత విద్యార్థుల భవిష్యత్ రూపకల్పనలో అల్యూమిని విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. పరిశ్రమల్లో స్థిరపడిన అల్యూమిని విద్యార్థులు తమ అనుభవాలు, నైపుణ్యాలు, కెరీర్ మార్గదర్శకత్వాన్ని ప్రస్తుత విద్యార్థులతో పంచుకోవడం ద్వారా వారికి సరైన దిశానిర్దేశం లభిస్తుందని అన్నారు. అలాగే ఇంటర్న్‌షిప్స్, ప్లేస్‌మెంట్స్, స్టార్టప్ అవకాశాలు, పరిశోధన కార్యకలాపాల్లో తమ సహకారం సంస్థకు మరింత బలాన్నిస్తుందని పేర్కొన్నారు. అల్యూమిని మరియు యూనివర్సిటీ మధ్య బలమైన అనుబంధం కొనసాగితే విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని, సమాజానికి ఉపయోగపడే నాణ్యమైన ఇంజినీర్లను తయారు చేయడం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అల్యూమిని విద్యార్థిని లీల శ్రీ మాట్లాడుతూ తమ ఉద్యోగ జీవితానికి బలమైన పునాదిని అందించిన మిట్స్ యూనివర్సిటీ మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకుల నాణ్యమైన బోధన, ఆధునిక ల్యాబ్ సౌకర్యాలు తమను పరిశ్రమ అవసరాలకు తగిన విధంగా తీర్చిదిద్దాయని అన్నారు. ప్రస్తుత విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. భవిష్యత్తులో కూడా సంస్థ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎం.శ్రీదేవి, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.నాగాశ్వేత, కోఆర్డినేటర్ వి.గీత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :