Thursday, 30 July 2026 03:34:31 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ విద్యార్థుల పారిశ్రామిక పర్యటన లో అక్షయ ఫౌండేషన్ కార్యాలయం సందర్శన

Date : 04 June 2026 10:43 PM Views : 78

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 04 : మదనపల్లి సమీపంలోని అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీకి చెందిన ఎంబీఏ విద్యార్థులు పారిశ్రామిక పర్యటనలో భాగంగా బెంగళూరులోని అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు పారిశ్రామిక నిర్వహణ, సరఫరా గొలుసు నిర్వహణ , సామాజిక బాధ్యత వంటి అంశాలపై ప్రత్యక్ష అవగాహన పొందారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజూ వేలాది మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారీ ఎత్తున పోషకాహార భోజనాన్ని ఎలా తయారు చేస్తారో, అలాగే సమర్థవంతమైన సరఫరా గొలుసు నిర్వహణ ద్వారా నిర్ణీత సమయంలో ఎలా పంపిణీ చేస్తారో విద్యార్థులు ప్రత్యక్షంగా పరిశీలించారు. అదేవిధంగా, ఇస్కాన్ కాంప్లెక్స్ మరియు వసంతపుర ప్రాంతాల్లో ఉన్న అత్యాధునిక స్వయంచాలక వంటశాలల పనితీరును సందర్శించి వాటి నిర్వహణ విధానాలను అధ్యయనం చేశారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు సేవా సంస్థల నిర్వహణ విధానం, సమాజ సేవలో సంస్థల పాత్ర, జట్టుకృషి ప్రాముఖ్యత, కార్యాచరణ సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు మరియు సామాజిక బాధ్యత వంటి అంశాలపై విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు. ఈ పారిశ్రామిక పర్యటనలో డాక్టర్ శిరీష, డాక్టర్ ఎలియ్యల అధ్యాపకుల బృందం మరియు 48 మంది విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :