Monday, 14 September 2026 07:40:29 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేయండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి

Date : 16 April 2026 10:06 PM Views : 280

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 16 ః గ్రామ సచివాలయ సిబ్బంది ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ అంకితభావంతో పనిచేయాలని మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి సూచించారు. గురువారం ఆమె తాసిల్దార్ శ్రీనివాసులతో కలిసి మండలంలోని గుండ్లపల్లి సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హాజరు రిజిస్టర్, రికార్డులు పరిశీలించారు, సచివాలయ ఉద్యోగుల పనితీరు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ ఉద్యోగులు పంచాయతీలోని ప్రతి గ్రామం క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలన్నారు. వేసవికాలం దృశ్య తాగునీటి సమస్యలపై శ్రద్ధ చూపాలని అదేవిధంగా పారిశుధ్యం మెరుగు, గ్రామీణ వైద్యం, ఉపాధి హామీ, మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు పై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అనంతరం భూముల రీ సర్వే పై క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించారు. రీ సర్వేలో రైతుల భూముల సమస్యల సామరస్యంగా పరిష్కరించి పరిస్థితి చేయి దాటితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి దారి చూపాలన్నారు. రీ సర్వే పూర్తి పారిదర్శకంగా నిర్వహించాలని సందేహాల నివృత్తికి ఉన్నతాధికారుల సలహాలు సూచనలు పాటించాలని రీ సర్వే బృందానికి సలహా ఇచ్చారు. రీ సర్వే పూర్తయిన తర్వాత ఖచ్చితమైన భూ వివరాలతో పట్టాదారు పాస్ బుక్కులు పంపిణీ చేయాలని తాసిల్దార్ కు సూచించారు. ఆమె వెంట ఆర్ఐ ముద్దుకృష్ణ, మండల సర్వేయర్ నాగరాజు, రీ సర్వే టిఏ రవి, వీఆర్వోలు నాగరాజు, ప్రభాకర్ విఆర్ఏలు, రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: