Thursday, 30 July 2026 10:27:09 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

క్రమశిక్షణ,పట్టుదల,ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి - విద్యార్థులకు విద్యాసంస్థల అధినేతల సూచనలు - ఘనంగా శ్రీసాయి చైతన్య జూనియర్ కళాశాల ఫేర్వెల్ డే

Date : 29 January 2026 08:13 PM Views : 184

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : క్రమశిక్షణ,పట్టుదల,ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి - విద్యార్థులకు విద్యాసంస్థల అధినేతల సూచనలు - ఘనంగా శ్రీసాయి చైతన్య జూనియర్ కళాశాల ఫేర్వెల్ డే - అబ్బురపరిచిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు మదనపల్లె : క్రమశిక్షణ,పట్టుదల,ఆత్మస్థైర్యంతో విద్యార్థులు ముందుకు సాగి అద్భుత విజయాలను అందుకోవాలని విద్యార్థులకు పలు విద్యాసంస్థల అధినేతలు సూచించారు.గురువారం శ్రీ సాయి చైతన్య జూనియర్ కళాశాల ఫేర్వెల్ డే వేడుకలు బైపాస్ రోడ్డులోని శ్రీ రామ తులసమ్మ కన్వెన్షన్ హాల్ నందు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విద్యోదయ హైస్కూల్ కరస్పాండెంట్ పి.శ్రీనివాసులు,న్యూలిటిల్ ఫ్లవర్ హైస్కూల్ కరస్పాండెంట్ రామకృష్ణారెడ్డి,విఎస్ఆర్ గ్రాండ్స్ అధినేత వి.సుధాకర్ రెడ్డి,పిఎన్ఆర్ ప్రాపర్టీస్ సిఎండి కె.ప్రణీత్ రెడ్డి,విశ్వం డిగ్రీ కళాశాల డీన్ శ్రీనివాసులు రెడ్డి,గాయత్రి డిగ్రీ కళాశాల చైర్మన్ శంకర్ రెడ్డి,విజేత కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శంకర్ యాదవ్,ప్రముఖ గాయిని భూదేవి,ప్రముఖ మోటివేటివ్ స్పెషలిస్ట్ రామ్మూర్తి,శ్రీ గుడ్విల్ కంప్యూటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.ముందుగా అతిథులకు కళాశాల చైర్మన్ కే.నిర్మల్ కుమార్ రెడ్డి,సీఈఓ ఎం.రాజేశ్వర్ రెడ్డి,డీన్ ఎం.పురుషోత్తం,ప్రిన్సిపాల్ ఆర్.ధనుంజయ రెడ్డి,వైస్ ప్రిన్సిపాల్ వై.నరసింహులు అపూర్వ స్వాగతం పలికారు.ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఉన్నత చదువులకు వెళ్లాలంటే ఇంటర్మీడియట్ నందు విద్యార్థులు మంచి మార్కులు సాధించి గట్టి పునాది వేసుకోవాలన్నారు.చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఓ ప్రణాళిక బద్ధంగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.శ్రీసాయి చైతన్య జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ విద్యలో నూతన ఒరవడిని సృష్టిస్తోందని ప్రశంసించారు.అనంతరం కళాశాల చైర్మన్ నిర్మల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన చేస్తూ ప్రతి ఏడాది అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుండడం గర్వంగా ఉందన్నారు.అదేవిధంగా ఇంటి వాతావరణాన్ని తలపించే వసతి గృహాలు మా ప్రత్యేకత అన్నారు.సాధారణ విద్యార్థులచే ప్రతి ఏడాది అసాధారణ ఫలితాలు సాధిస్తుండడం గర్వంగా ఉందన్నారు.తమ కళాశాల అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు,అధ్యాపకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.అనంతరం విద్యార్థిని,విద్యార్థులచే ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: