నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 02 : తంబళ్లపల్లి మండలంలోని ఏపీ సీ ఎన్ ఎఫ్ సభ్యులతోపాటు మహిళా వివో సంఘ సభ్యులు, గ్రూపు సభ్యులు ప్రకృతి వ్యవసాయం సాగుపై ప్రజల్లో అవగాహన పెంచాలని ఐకెపి ఏపిఎం గంగాధర్ సూచించారు. గురువారం మండలంలోని వివో సంఘ లీడర్లు, సి ఎన్ ఎఫ్ సభ్యులకు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండలంలో రైతులు ప్రకృతి వ్యవసాయంలో జీవన ఎరువులు, కషాయాలు వాడకంతో పండించిన పంటలు తిరిగి రైతులకే అమ్మి భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయ పంటల సాగు విస్తరించాలన్నారు. ప్రకృతి వ్యవసాయ పంటల దిగుబడి కోసం రైతుల ఆర్థిక అభివృద్ధి కేంద్రం సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతుల నుండి ప్రకృతి వ్యవసాయ పంటలను సేకరించి గ్రేడింగ్ ద్వారా స్థానిక రైతులకే పంటలను మార్కెటింగ్ చేయడంతో ప్రకృతి వ్యవసాయ పంటల దిగుబడి పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సిసిలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, సీ ఎన్ ఎఫ్ అధికారులు, సభ్యులు పాల్గొన్నారు
Reporter
Namitha News