Sunday, 13 September 2026 07:09:24 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మాజీ సైనికుల ఆస్తి ని కాజేయడానికి కబ్జా దారుల కుట్ర -

అడ్డుకున్న మాజీ సైనికులపైన దాడి

Date : 29 December 2025 07:16 PM Views : 234

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మాజీ సైనికుల ఆస్తి ని కాజేయడానికి కబ్జా దారుల కుట్ర - అడ్డుకున్న మాజీ సైనికులపైన దాడి - పోలీసులకు పిర్యాదు చేసిన న్యాయం చేయక పొగా తమ పైనే కేసు - ప్రాణ హాని పొంచి వుంది న్యాయం చేయూలని మాజీ సైనికుడు లక్ష్మి ప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి - పీలేరు నియోజకవర్గం లో మాజీ సైనికులపై దాడుల జరుగుతున్న పోలీసుల వైఖరి ఆక్షేపనియం - మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఆరోపణ పీలేరు మండలం బోడుమల వారి పల్లికి చెందిన లేట్ చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు మాజీ సైనికుడు ఎన్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఆస్తి ని కాజేయడానికి కబ్జా దారుల కుట్ర పన్నారని మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఆరోపించారు.వారికి వారసత్వంగా లభించిన 1.27 ఎకరాల భూమిలో కొంత భాగం కొబ్బరి,టేకు,మామిడి చెట్లను పెంచి మిగిలిన స్థలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అయితే పీలేరు కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎన్ అమర్నాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి, మహేష్ గుప్తాలు వారి అనుచరులతో వారి భూమి పక్కన సర్వేనెంబర్ 658/2 లో భూమిని కొనుగోలు చేశారని లక్ష్మీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. వారికి స్థలం లోకి వెళ్లేందుకు దారి కావాలని బిఎస్ఎఫ్ మాజీ సైనికుడైన గుర్రం మహేశ్వర్ రెడ్డి తో ఆ విషయాన్ని అడిగించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ విషయంపై సోమవారం ది మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్న అమర్నాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి, మహేష్ గుప్తాలు అనుచరులతో జెసిబి తో వచ్చి తన భూమికి ఏర్పాటు చేసుకున్న ఫెన్సింగ్ ను తొలగిస్తుండగా తాను, గుర్రం మహేశ్వర్ రెడ్డి తో వెళ్లి అడ్డుకోగానే వారి అనుచరులు తమపై విచక్షణ రహితంగా దాడి చేసి, రక్త గాయాలు అయ్యే విధంగా కొట్టడం జరిగిందని ఆరోపించారు. ఈ సంఘటన పైన తాము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని చెప్పారు. అయితే పోలీసులు తమకు న్యాయం చేయకపోగా తమపైనే ఎదురు కేసు పెట్టడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ప్రాణాన్ని పొంచి ఉందని, ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఈ ఫిర్యాదు పై విచారించి న్యాయం చేయాలని కోరారు. మదనపల్లె డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ మాజీ సైనికుడికి పిత్రార్జితంగా వచ్చిన వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటే ఆ భూమిని కబ్జా చేయడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాజీ సైనికులపై దాడి చేయడం, గాయ పరచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు స్పందించిన విధానం పై తీవ్రంగా ఆక్షేపించారు. న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితులపై ఎదురు కేసు పెట్టడం సమంజసమేనా అని ప్రశ్నించారు. కబ్జాదారుల నుంచి ప్రాణ హాని పొంచి ఉన్నదని ఆందోళన చెందుతున్న మాజీ సైనికులకు ప్రభుత్వం భద్రత కల్పించి,ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత కొంత కాలంగా పీలేరు నియోజక వర్గంలో మాజీ సైనికుల పై దాడులు కొనసాగుతూ ఉన్నాయని వీటిని నియంత్రించాల్సిన పోలీసు అధికారులు ప్రేక్షకు పాత్రకు పరిమితం కావడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము సైతం దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని పోలీసు అధికారులు కూడా గుర్తించి బాధితుల పక్షాన నిలవాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాజీ సైనికులకు ఐదు ఎకరాల వరకు వ్యవసాయ భూమి మరియు ఇంటి నివేశ స్థలం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే అవి ఇవ్వకపోగా వారసత్వంగా వచ్చిన భూమిని సైతం కబ్జా చేస్తున్న అడ్డుకోవాల్సిన అధికారులు స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశం లో పీలేరు నియోజకవర్గం మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు రెడ్డెప్ప రెడ్డి, కార్యదర్శి దామోదర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి, రవీంద్రారెడ్డి, మదనపల్లి కార్యదర్శి సుబ్బరాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మీపతి డి నరేంద్ర లు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :