Sunday, 13 September 2026 10:18:01 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

తప్పుడు పత్రాలు సృష్టించి మా స్థలాలపై కన్నేశారు - మా తాత్కాలిక కట్టడాలను కూల్చివేశారు

న్యాయం చేయాలంటూ అధికారులకు బాధితులు విజ్ఞప్తి

Date : 04 May 2026 07:44 PM Views : 261

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తప్పుడు పత్రాలు సృష్టించి మా స్థలాలపై కన్నేశారు - మా తాత్కాలిక కట్టడాలను కూల్చివేశారు - న్యాయం చేయాలంటూ అధికారులకు బాధితులు విజ్ఞప్తి - స్థలం వద్దకు వెళ్లి పరిశీలించిన రెవెన్యూ అధికారులు మదనపల్లె : పట్టణంలోని బైపాస్ రోడ్డు,శ్రీదేవి గార్డెన్స్ పక్కన ఉన్న సర్వే నెంబర్ 67 నందు 1997లో 1.55 సెంట్ల భూమిని తాము 44 మంది శ్రీ చౌడేశ్వరి మహిళా సేవా సొసైటీ నుండి కొనుగోలు చేయడం జరిగిందని,అయితే అప్పటి పరిస్థితుల ప్రభావం వల్ల ఇళ్లను నిర్మించుకోలేకపోయామని బాధితులు తెలిపార.అయితే ఈ మధ్యకాలంలో ఆలూరి సుధాకర్ బాబు,జింకా నరసింహులు అనేవారు యర్రపురెడ్డి అనే వ్యక్తి దగ్గర వారు సదరు భూమిని కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని బాధితులు ఆరోపించారు.ఆ భూమి వారికే వర్తిస్తుందని 2011లో కోర్టు నుండి అసలు హక్కుదారులైన మాకు నోటీసులు పంపించారన్నారు.తాము సైతం కోర్టును ఆశ్రయించగా మా రిజిస్ట్రేషన్ పత్రాలు పరిశీలించి 20 మందికి ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందన్నారు.ఇదిలా ఉండగా మా స్థలాల్లో మేము తాత్కాలికంగా ఇళ్లను నిర్మించుకుంటుంటే వారి అనుచరులు,ప్రజాసంఘాల వారిని పురమాయించి నిర్మాణాలను తొలగించి మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై పీజీఆర్ఎస్ నందు ఫిర్యాదు చేయడం జరిగిందని,అదేవిధంగా మా స్థలాల్లో టెంట్ ఏర్పాటు చేసి నిరసన తెలిపామన్నారు.ఇదిలా ఉండగా సోమవారం ఇన్చార్జి తహసిల్దార్ వెంకటస్వామి,ఆర్.ఐ బాలసుబ్రమణ్యం,సర్వేయర్ సుబ్రహ్మణ్యంలు సదరు స్థలానికి వెళ్లి బాధితుల వివరణ తీసుకున్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఇరువర్గాల వారి పత్రాలను పరిశీలించి నివేదికను జిల్లా కలెక్టరుకి పంపించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఆలూరి సుధాకర్ బాబు,జింకా నరసింహులు నుండి మాకు రక్షణ కల్పించి,మా స్థలాలను మాకు ఇప్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :