నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 12 : తంబళ్లపల్లె మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ సిఇసి మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్ కరీమున్నీసా జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో తన అసమాన ప్రతిభతో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైంది. కరి మున్నీసాను ప్రిన్సిపాల్ తో పాటు పి టి, అధ్యాపకురాలు లత,ఉపాధ్యాయ బృందం, సహచర విద్యార్థులు అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలో రాణించడం హర్షనీయమని కరిమున్నీసా రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక కావడం పాఠశాల తో పాటు అన్నమయ్య జిల్లాకే మంచి పేరు తేవాలని ఆశీర్వదించారు. ఎంఈఓలు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడులు కరిమున్నీసాను ప్రశంసించి ఆమె ప్రతిభకు కారణమైన ప్రిన్సిపల్, అధ్యాపక బృందాన్ని ప్రశంసించారు
Reporter
Namitha News