Wednesday, 16 September 2026 12:52:44 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

తోపుడుబండ్లకు దినసరి పన్నులు(గేటు) తగ్గించాలి - AITUC

గత సంవత్సర టెండరుదారునికి చెల్లించిన విధంగానే గేటు రుసుములు చెల్లిస్తాం

Date : 04 April 2026 09:03 PM Views : 281

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 04 : బి.కొత్తకోట పట్టణంలో తోపుడుబండ్లమీద వివిధ రకాల చిన్నచిన్న వ్యాపారులు చేసుకునే కార్మికులు నగర పంచాయతీకి చెల్లించవలసిన దినసరి పన్ను (గేటు)ను,గత సంవత్సరం చెల్లించిన విధంగానే ప్రస్తుత టెండర్ దారునికి చెల్లిస్తామని, అంతకుమించి చెల్లించలేమని ఏఐటియుసి మండల అధ్యక్ష,కార్యదర్శులు ఎస్.తంబయ్యశెట్టి, జి.రఘునాథ్ లు నొక్కి వక్కాణించారు.నూతన టెండర్ దారులు ఒక్కొక్క తోపుడు బండికి 30 నుంచి 50 రూపాయలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నందుకు నిరసనగా, ఏఐటియుసి బీ.కొత్తకోట మండల సమితి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు స్థానిక నగర పంచాయతీ కార్యాలయం ఎదుట తోపుడుబండ్ల కార్మికులతో కలసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జి.రఘునాథ్,ఎస్.తంయ్య శెట్టి లు మాట్లాడుతూ; బి.కొత్తకోట పట్టణంలో సుమారు 150 మందికి పైగా చదువుకున్న యువకులు మరియు పేదలు,మహిళలు తోపుడుబండ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని, పట్టణంలోని వీధుల గుండా చమటోడ్చి తమ బండ్లను నెట్టుకుంటూ, ఇంకోవైపున గొంతులు అరిగేలా అరుచుకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. పట్టణంలో ప్రభుత్వ స్థలాలు లేని కారణంగా రోడ్లపై మండుటెండలును సైతం లెక్కచేయకుండా, ఒకవైపున వాహన దారులతోనూ, ఇంకోవైపున పోలీసులతో చివాట్లకు గురవుతున్నా కూడా వాటిని భరించి తమ కుటుంబాల పోషణకు,తమ పిల్లల చదువుల కోసం విధిలేని పరిస్థితులలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారని అన్నారు.ఇలాంటి పరిస్థితులలో నూతన టెండర్ దారులు దినసరి గేటును పెంచడం చాలా అన్యాయమని,శారీరక శ్రమతో తలమీద,భుజాల మీద తమ సరుకులు మోసుకొంటూ వీధులలో అమ్ముకునే వారిని కూడా గేటు కట్టాలని వత్తి చేయడం ఇంకా చాలా దుర్మార్గమని ఆక్రోశం చెందారు.గత సంవత్సరం చెల్లించిన విధంగా స్థిరంగా ఒకేచోట వుండే తోపుడుబండ్లకు రోజుకు 20 రూపాయలు, వీధులలో తమ బండ్లను నెట్టుకుంటూ వ్యాపారులు చేసుకునే వారికి రోజుకు 10 రూపాయలు చొప్పున గేటు వసూలు చేయాలని, అలాగే తలమీద,భుజాల మీద బరువులు ఎత్తుకుని వ్యాపారులు చేసుకునే వారి వద్ద నుండి ఏమాత్రం కూడా పన్నులు వసూలు చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే ఎర్రజెండా తోపుడుబండ్ల కార్మికులకు అండగా నిలబడి,ఎలాంటి పోరాటాల కైనా సిద్ధపడుతుందని హెచ్చరించారు. అనంతరం నగర పంచాయతీ కమిషనర్ రమాదేవికి వినతి పత్రం సమర్పించారు.టెండరు దారులతో మాట్లాడి గతంలో మాదిరిగానే పన్నులు వసూలు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు ఎం.అష్రఫ్అల్లీ,తోపుడుబండ్ల కార్మికులు అక్బర్, అమీర్ భాష,నర్సింహులు, మస్తాన్,బద్రి,పర్వీజ్,బావాజాన్,రవి,రామానుజులు,నౌషాద్,వల్లి సాబ్, భాష,తోసిఫ్,జమీర్, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: