నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : వైసీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి - రాజకీయాలలో హుందాతనం ఎంతో అవసరం - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె.వెంకటేష్ హితవు మదనపల్లె : వైసీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని,రాజకీయాలలో హుందాతనం ఎంతో అవసరమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆర్.జె.వెంకటేష్ పేర్కొన్నారు.మంగళవారం పట్టణంలోని నిమ్మనపల్లె సర్కిల్ నందు గల టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్.జె.వెంకటేష్ మాట్లాడుతూ ఇటీవల మదనపల్లె పట్టణానికి చెందిన కొందరు వైఎస్సార్సీపీ నాయకులు టిడిపి నాయకులు,ఎమ్మెల్యే షాజహాన్ బాషాపైన అనవసర వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.ముఖ్యంగా సుదీర్ఘంగా రాజకీయాలలో అనుభవం కలిగిన మాజీ ఛైర్ పర్సన్ షమీం అస్లాం ఎమ్మెల్యే జనరల్ ఫండ్ 40 కోట్లు ఏమిటి 400 కోట్లు తీసుకొస్తాననే వ్యాఖ్యలపై హేళనగా మాట్లాడడం సబబు కాదన్నారు.తాము కౌన్సిల్లో ఆమోదించిన పనులకు ఎమ్మెల్యే టెంకాయలు కొట్టి,భూమి పూజలు చేస్తున్నారనే ఆరోపణలను ఆయన తిప్పి కొట్టారు.వాస్తవానికి మున్సిపల్ కౌన్సిల్ కి ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా వ్యవహరిస్తారని అందులో భాగంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనవచ్చునని వివరణ ఇచ్చారు.అంతేకాకుండా ప్రోటోకాల్ నిబంధన పాటించడం లేదని గగ్గోలు పెడుతున్నారని,ప్రోటోకాల్ అంశం పూర్తిగా కమిషనర్ పరిధిలో ఉంటుందన్నారు.ఏ వార్డులో కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఆ వార్డు కౌన్సిలరుకి సమాచారం ఇవ్వాల్సింది కమిషనర్ మాత్రమేనని,ఈ విషయాన్ని వారు గుర్తించుకోవాలన్నారు.ప్రోటోకాల్ నిబంధనను ఎమ్మెల్యే షాజహాన్ బాషా కచ్చితంగా పాటిస్తారని,గతంలో తన భార్య సర్పంచిగా ఉన్న సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారని మా పంచాయతీ పరిధిలోని హరిజనవాడ అనుకోకుండా కార్యక్రమం ఏర్పాటు చేయడంతో తాము 45 నిమిషాలు ఆలస్యంగా వెళ్లినప్పటికీ ఆయన వేచిఉన్నారని,ఇదే ఆయన ప్రోటోకాల్ నిబంధనపై ఎంత స్పష్టంగా ఉంటారో అర్థం అవుతుందన్నారు.అదేవిధంగా ఉన్న బడ్జెట్లో చక్కగా అభివృద్ధి పనులు చేస్తూ ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారన్నారు.మదనపల్లి మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడు ఒక చిన్న పంచాయతీగా ఉండేదని తదానంతరం విస్తరించి మున్సిపాలిటీగా ఆవిర్భవించిందని అదే సమయంలో మదనపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న అంకిశెట్టిపల్లి,కొత్తపల్లి,కొత్తిండ్లు,కోళ్లబైలు పంచాయతీలు భౌగోళికంగా దగ్గరయ్యాయన్నారు.మున్సిపాలిటీ పరిధి పెరగడంతో మౌలిక సదుపాయాల కల్పనకు కొంత వెనుకబడిన మాట వాస్తవమేనని,అయినప్పటికీ కాంట్రాక్టర్ల ద్వారా ఉన్న నిధులతోనే మౌలిక సదుపాయాలు కల్పనకు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు.గత వైసిపి పాలనలో ఏవైనా పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేదని,బిల్లులు సకాలంలో మంజూరైన దాఖలాలు లేవన్నారు.ఇక షమీం అస్లాం మాట్లాడుతూ అన్ని చేతులు,ఇన్ని చేతుల అని చెబుతున్నారని వారి నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాల్లో ఉన్నారని,ఆయన సోదరుడు స్వర్గీయ భాస్కర్ రెడ్డి,ఆయన తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి,ఆయన మరో సోదరుడు ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ఇన్ని చేతులు మీ వైపు ఉన్నప్పుడు ఎమ్మెల్యే జహాపై విమర్శలు చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.మరో వైసీపీ నాయకుడు రఫీక్ అహమ్మద్ మాట్లాడుతూ మేము గుండ్లూరు వారమని చెబుతున్నారని పెన్షన్లు ఎన్ని ఇస్తున్నారని ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారన్నారు.కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తోందని ప్రతి వార్డులో బాధ్యతగా పెన్షన్లు,సంక్షేమ పథకాలను కూటమి నాయకులు అందజేస్తున్నారన్నారు.సూపర్ సిక్స్ పథకాలతో మైనార్టీలకు ఎంతో మేలు చేకూరుతోందన్నారు.తల్లికి వందనం ద్వారా ప్రతి ఇంట్లో కనీసం ఐదారుగురికి లబ్ది ఉందనే విషయాన్ని గమనించాలన్నారు.ఇప్పటికైనా వైసీపీ నాయకులు వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని,అనవసరపు ఆరోపణలు మాని మదనపల్లి జిల్లా అభివృద్ధికి సహకరించి ప్రశాంతమైన వాతావరణానికి బాటలు వేయాలని హితవు పలికారు.అనంతరం నిమ్మనపల్లి మండల తెలుగు యువత అధ్యక్షులుగా నియమితులైన బి.శివకృష్ణను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే శివకృష్ణ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లె మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఉదయ్ కుమార్,ప్రధాన కార్యదర్శి గణపతి,కార్యదర్శి వేణుగోపాల్,ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసులు,మాజీ సర్పంచ్ బద్దెల రాజన్న,గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున,ఉపాధ్యక్షుడు గోపాల్, రామచంద్ర నాయుడు,ఒట్టికొండ రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News