నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 08 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ విద్యార్థులు ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ISTE)-2025, ఆంధ్రప్రదేశ్ విభాగం ఇటీవల ప్రదానం చేసిన ప్రతిష్ఠాత్మక విద్యార్థి అవార్డులను అందుకున్నారని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా, టెక్కలిలోని ఆదిత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్ (AITAM) కళాశాలలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో బెస్ట్ సీఎస్‌ఈ స్టూడెంట్ అవార్డును ఎం. హర్షితా రెడ్డి, బెస్ట్ ఈసీఈ స్టూడెంట్ అవార్డును ఎ. సత్య ప్రియ, బెస్ట్ మెకానికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్ అవార్డును కె. మహమ్మద్ అజ్మతుల్లా, బెస్ట్ స్టూడెంట్ ఇన్నోవేటర్ అవార్డును సీఎస్‌ఈ విభాగానికి చెందిన గోర్ల తేజ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనంతపురం (జేఎన్‌టీయూఏ) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెచ్. సుదర్శన రావు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హెచ్. సుదర్శన రావు మాట్లాడుతూ సాంకేతిక విద్యాభివృద్ధికి ఐఎస్టీఈ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, ఆవిష్కరణ దృక్పథాన్ని పెంపొందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో యువత విశేష ప్రతిభ కనబరచాలని అన్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ప్రతాప్‌సింహ్ కాకాసాహెబ్ దేశాయ్ (ప్రెసిడెంట్, ISTE, న్యూఢిల్లీ), ప్రొఫెసర్ జి. రంగ జనార్దన్ (చైర్మన్, ISTE), ప్రొఫెసర్ బి. ఈశ్వర్ రెడ్డి (సెక్రటరీ, ISTE-ఆంధ్రప్రదేశ్), డాక్టర్ పొట్లూరి రవీంద్ర బాబు, ప్రొఫెసర్ టి.ఎస్.ఎస్. బాలాజీ, డాక్టర్ శివప్రసాద్ రెడ్డి (నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ISTE) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి మాట్లాడుతూ, ఐఎస్టీఈ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి మిట్స్ విద్యార్థులు అవార్డులు అందుకోవడం యూనివర్సిటీకి గర్వకారణమని అన్నారు. అవార్డులు పొందిన విద్యార్థులను మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల,వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్, ఐఎస్టీఈ కోఆర్డినేటర్ డాక్టర్ కె. శ్రీ దివ్య, విభాగాధిపతులు మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.
Reporter
Namitha News