Sunday, 13 September 2026 07:57:30 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

అలుపెరగని శ్రామికుడు రెడ్డి భాష కి సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ పెక్టర్ గా పదోన్నతి

29 ఏళ్లు గా మచ్చలేని డ్రైవర్ రెడ్డి భాష ఆర్టీసీ కే ఆదర్శప్రాయుడు

Date : 31 March 2026 09:50 PM Views : 256

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 31 : నాడు కఠినమైన శిక్షణలతో కూడిన ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగంలో ఎలాంటి మచ్చ లేకుండా 29 ఏళ్లు పనిచేసి అధికారుల మన్ననలు పొంది, ఎనిమిది సంవత్సరాలుగా సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్గా నేటితరం డ్రైవర్లకు సలహాలు, సూచనలందిస్తూ రెడ్డి బాష అందరికీ ఆదర్శంగా నిలిచాడు. పెద్దమండెం మండల కేంద్రంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి వెలిగల్లు లో విద్యాభ్యాసం చేసిన రెడ్డి భాష 1997 లో ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం కోసం వారు ఇచ్చిన కఠినమైన శిక్షణలను తన మెరుగైన పనితనంతో అధిగమించి డ్రైవర్ ఉద్యోగం సంపాదించాడు. నాటినుండి బి.కొత్తకోట ఆర్టీసీ డిపోలో నాలుగు సంవత్సరాలు, మదనపల్లి-2 డిపోలో నాలుగు సంవత్సరాలు, కుప్పం డిపోలో రెండు సంవత్సరాలు, తిరుమల డిపోలో రెండు సంవత్సరాలు, మదనపల్లె-1 డిపోలో ఏకంగా 17 సంవత్సరాలు మొత్తం 29 సంవత్సరాలు ఆర్టిసి కి డ్రైవర్ గా సేవలందించాడు. ఈ మొత్తం ఆర్టీసీ సేవలలో తన డ్రైవింగ్ లో ఎలాంటి లోటు పాట్లు లేకుండా సహచర ఉద్యోగులతో సమన్వయం తో ఎలాంటి మచ్చలేకుండా తన విధి నిర్వహణతో ఉన్నతాధికారుల నుండి ఉత్తమ డ్రైవర్ గా పలు మార్లు ప్రశంసలు అందుకున్నాడు. రెడ్డి భాష ఆర్టీసీకి చేసిన సేవలను గుర్తింపుగా ఆయనకు సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి లభించింది. నేడు ఆయన సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ గా నేటితరం డ్రైవర్లకు తన అనుభవాన్ని రంగరించి అమూల్యమైన సలహాలు, సూచనలు, చేస్తున్నారు. ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించడం, ప్రయాణికుల భద్రత, సహచర ఉద్యోగుల తో సంఘీభావం, సమయపాలన పాటించడం ఉన్నతాధికారుల వద్ద గౌరవంగా వ్యవహరించడం, ఆర్టీసీ సంస్థ మనుగడకు ఇందన పొదుపుకు పంచ సూత్రాలు, డ్రైవింగ్ లో మెలుకువలు, సమయ స్ఫూర్తి, ఇంకా పలు అంశాలపై కూలంకషంగా అవగాహన కల్పించి ప్రయాణికుల క్షేమం తోపాటు సంస్థ అభివృద్ధికి తనవంతు సేవలు అందించాలని సూచనలు చేశారు. నేటి తరం ఆర్టీసీ డ్రైవర్ లకు ఆయన ఓ దిక్సూచిగా నిలిచి ఆదర్శంగా నిలవడం అభినందనీయం

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :