Sunday, 13 September 2026 06:55:39 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

నిరుపేదలైన వ్యవసాయ కూలీలకు సాగు భూమిని పంపిణీ చేయాలి - సీపీఐ

జనవరి 4న జరిగే భూ పోరాట సదస్సును జయప్రదం చేయండి - సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.కృష్ణప్ప

Date : 03 December 2025 10:51 PM Views : 212

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - డిసెంబర్ 03: బి.కొత్తకోట మండలంలోని బీరంగి గ్రామంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ, అగ్రవర్ణ పేదలు తదితర భూమిలేని వ్యవసాయ కూలీలకు ఒక్కొక్క కుటుంబానికి మూడు ఎకరాలు చొప్పున సాగు భూమిని పంపిణీ చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.కృష్ణప్ప రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం ఉదయం 11 గంటలకు బీరంగి గ్రామంలోని మొరవపల్లి ఎస్సీ కాలనీ నందు, సిపిఐ బీరంగి శాఖ సమావేశం, శాఖ కార్యదర్శ పి. నారాయణ స్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన టి. కృష్ణప్ప, నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి,మండల కార్యదర్శి జి. రఘునాథ్ లు హాజరై ప్రసంగించారు.బీరంగి గ్రామంలో వందల ఎకరాల ప్రభుత్వ మిగులు భూములు పెద్ద పెద్ద భూస్వాముల కబంధ హస్తాలలో పెట్టుకొని అనుభవించుకుంటూ ఉన్నారని, వారి చెర నుంచి సదరు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిరుపేదలకు పంచాలని అన్నారు. గ్రామంలో సొంత ఇల్లు లేని పేదలు చాలామంది ఉన్నారని వారందరికీ మూడు సెంట్లు చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించి పక్కా గృహ నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయల రుణాన్ని మంజూరు చేయాలని, అలాగే గత మూడున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు,వికలాంగ,ఒంటరి మహిళ,డప్పు కళాకారులు తదితర పింఛన్లను పంపిణీ చేయడం లేదని,వెంటనే వీరందరికీ నూతన పింఛన్లు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.2026 సంవత్సరం జనవరి 4వ తేదీన బీరంగి గ్రామంలో సోంపురాళ్ల మిట్ట వద్ద భూ పోరాట సదస్సు జరుగుతుందని, ఈ యొక్క సదస్సుకు సిపిఐ రాష్ట్ర పార్టీ నాయకులు,వ్యవసాయ కార్మిక సంఘం,రైతుసంఘం రాష్ట్ర నాయకులు,జిల్లా పార్టీ నాయకులందరూ కూడా హాజరవుతున్నారని,ఈ యొక్క సదస్సులో పేదలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జి.లక్ష్మన్న,జి. శంకర,ప్రసాదు,గంగన్న, వెంకటరమణ,వెంకటేష్, నాగరాజు, వెంకటేష్, మంజుల, మమత, కదిరప్ప తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :