Sunday, 13 September 2026 04:29:36 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

సైబర్ క్రైమ్ పై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

Date : 16 December 2025 07:29 PM Views : 220

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 16 : రామసముద్రం మండలం దిన్నెపల్లి గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను రామసముద్రం మండలం సబ్‌ ఇన్‌స్పెక్టర్ పి. దిలీప్ కుమార్ మరియు రాయచోటి శక్తి టీం నుండి పోలీస్ కానిస్టేబుల్ మణికంఠ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులకు మహిళలపై నేరాలు (Crime Against Women), సైబర్ క్రైమ్‌పై జాగ్రత్తలు, రోడ్డు భద్రత (Road Safety Awareness), బాల్య వివాహాల నివారణ, మంచి అలవాట్లు అలవర్చుకోవడం, అలాగే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాలపై సవివరంగా అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో బాలికలు ఎదుర్కొనే సమస్యలను వివరించి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని, హెల్ప్‌లైన్ నంబర్లు ఉపయోగించాలని సూచించారు. సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల జాగ్రత్తలు పాటించాలని, తప్పుడు సమాచారం, మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో విద్యార్థులకు స్పష్టంగా తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినులు సుమారు 250 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ మరియు బోధన సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థినుల్లో భద్రతపై అవగాహన పెంచడంలో ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని పాఠశాల యాజమాన్యం అభిప్రాయపడింది.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :