Saturday, 12 September 2026 01:52:34 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

రాష్ట్ర వాలీబాల్ జట్టుకు విశ్వం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి ఎంపిక

Date : 11 August 2026 04:23 PM Views : 144

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాష్ట్ర వాలీబాల్ జట్టుకు విశ్వం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి ఎంపిక క్రీడా ప్రతిభకు మరో ఘనత – సి. హేమంత్ కుమార్‌ను అభినందించిన కళాశాల యాజమాన్యం మదనపల్లె: విశ్వం ఇంజినీరింగ్ కళాశాల (అటానమస్), మదనపల్లెకు చెందిన విద్యార్థి సి. హేమంత్ కుమార్, బి.టెక్ తృతీయ సంవత్సరం ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE) విభాగంలో చదువుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలీబాల్ జట్టుకు ఎంపికై కళాశాలకు ఘనతను తీసుకువచ్చారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ జట్టుకు హేమంత్ కుమార్ ఎంపిక కావడం పట్ల విశ్వం ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ శ్రీ ఎం. ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థిని అభినందించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, పట్టుదల, జట్టుగా పనిచేసే సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేలా కళాశాల యాజమాన్యం నిరంతరం ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణ రెడ్డి మాట్లాడుతూ, హేమంత్ కుమార్ రాష్ట్ర వాలీబాల్ జట్టుకు ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమని అన్నారు. కఠోర సాధన, పట్టుదల, క్రమశిక్షణతో హేమంత్ ఈ స్థాయికి చేరుకోవడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కళాశాలలోని అన్ని అన్ని విభాగాల డీన్స్ మరియు అన్ని విభాగాల అధిపతులు (HODs), అధ్యాపకులు మరియు విద్యార్థులు, హేమంత్ కుమార్‌ను ఘనంగా అభినందించారు. రాష్ట్ర జట్టులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు, తల్లిదండ్రులకు మరియు జిల్లాకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. క్రీడా రంగంలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యతనిస్తూ విశ్వం ఇంజినీరింగ్ కళాశాల ముందుకు సాగుతోంది. హేమంత్ కుమార్ సాధించిన ఈ విజయం కళాశాలలోని ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కళాశాల యాజమాన్యం పేర్కొంది. “విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభకు విశ్వం ఇంజినీరింగ్ కళాశాల ప్రోత్సాహం”

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :