నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : .మదనపల్లి జిల్లాగా ప్రకటించబోతునదుకు కూటమి ప్రభుత్వానికి అభినందనలు . .ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. .G.o. no. 107,108,ppp విధానాన్ని రద్దు చేయాలి . .మదనపల్లి B.T కళాశాలను బీసెంట్యూనివర్సిటీగా ప్రకటించాలి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఎస్టియు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించబడింది. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చేసిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, దీనిపై ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) గా వ్యతిరేకత వ్యక్తం చేశారు అన్నమయ్య జిల్లా AISF ప్రధాన కార్యదర్శి మాధవ్ గారు మాట్లాడుతూ— మదనపల్లి జిల్లాగా ప్రకటించబోతున్నందుకు కూటమి ప్రభుత్వానికి మరియు nda కూటమిని స్థానిక MLA గారికి అభినందనలు తెలిపారు. ఎన్నికల ముందు మదనపల్లి జిల్లాపై చంద్రబాబు గారు, లోకేశ్ గారు స్పష్టమైన హామీ ఇచ్చారని, తాజాగా ప్రభుత్వం గెజిట్ విడుదల చేసి జిల్లా ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడం ప్రశంసనీయమని అన్నారు. అయితే, ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసిన ఇతర కీలక హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని విమర్శించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 6400 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని. ముఖ్యంగా, G.O. No. 107, 108లను రద్దు చేయాలి, PPP విధానాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు. మదనపల్లి B.T. కళాశాలకు యూనివర్సిటీ స్థాయి కల్పించి, దీన్ని బీసెంట్ యూనివర్సిటీగా ప్రకటించాల్సిన అవసరాన్ని ఆయన గట్టిగా ప్రస్తావించారు. ఇది మదనపల్లి ప్రాంత విద్యా అభివృద్ధికి అత్యంత కీలకమని తెలిపారు. అలాగే, ముందు ఏ విధంగా ఐతే బిటి కళాశాలను ప్రభుత్వ పరం చేసుకున్నామో అదే విధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను కూడా ప్రభుత్వ పరం చేసుకుంటాం అని హెచ్చరించారు .కాబట్టి Government Medical Collegeను PPP విధానంలోకి తీసుకురావడాన్ని AISF తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మాధవ్ గారు స్పష్టం చేశారు. విద్య–ఆరోగ్య రంగాలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు ప్రజల హక్కులను దెబ్బతీస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో, స్థానిక గౌరవ NDA కూటమి గారిని హెచ్చరిస్తున్నం అని తెలిపారు . ప్రజల సమస్యలు, విద్యార్థుల హక్కులు, ఎన్నికల హామీల విషయంలో ప్రభుత్వం వెనుకంజ వేస్తే AISF ఆధ్వర్యంలో ఉద్యమాలకు శ్రీకారం చుడదామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గర్ల్స్ కన్వీనర్ కో కన్వీనర్ భవిత,నవ్యశ్రీ మదనపల్లి నియోజకవర్గ సహాయ కార్యదర్శి సాయికిరణ్, మరియు ఏఐఎస్ఎఫ్ నాయకులు తరుణ్, రావత్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News