Sunday, 13 September 2026 11:57:12 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

సావిత్రి బాయ్ పూలే వేడుకల్లో వైసిపి సమన్వయకర్త నిసార్

Date : 03 January 2026 04:11 PM Views : 244

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మహిళల విద్యతోనే సమాజం వికసిస్తుందని నమ్మిన ఆధునిక భారత దేశ మొదటి మహిళ ఉపాద్యాయురాలు సావిత్రి బాయి ఫూలే -- కొనియాడిన మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్ -- వైసిపి కార్యాలయంలో ఘనంగా సావిత్రి బాయి ఫూలే 195 వ జయంతి ఆధునిక భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే నేటి మహిళ విద్యాకు స్పూర్తిదాయకం అని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. తాడిత, పీడిత ప్రజల ఆశజ్యోతి సావిత్రి బాయి పూలే 195 వ జయంతి సందర్భంగా అవెన్యూ రోడ్డు వైసిపి కార్యాలయంలో మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆద్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మహిళలు విద్యా రంగంలోను అన్ని రంగాలలో సమాన హక్కులు అవకాశాలు కల్పించాలని సావిత్రిబాయి ఫూలే ఎన్నో పోరాటాలు చేశారని వివరించారు. భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించారని, ఆమె ఆధునిక భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని వెల్లడించారు. ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని గుర్తు చేశారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యత, మహిళల హక్కుల కోసం పోరాటం చేయటం సామాజిక బాధ్యతగా భర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అడుగుజాడల్లో నడచి నవ నిర్మాణా వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి పోరాటం చేసిందని కొనియాడరు. ఆ మహనీయురాలు నాడు చేసిన మహిళ విద్యా పోరాటం నేటికి స్పూర్తిదాయకం అని వివరించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె మున్సిపల్ కౌన్సిలర్ల, వైసిపి నాయకులు, వివిధ హోదాల్లో పనిచేసే వైసిపి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: