నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 01 : రామసముద్రం మండలంలో తుఫాను ప్రభావం తో గత మూడురోజులుగా పడుతున్న చిరు జల్లులతో పలు పంటలు దెబ్బతిన్నాయి.ముఖ్యంగా పండు టమోటా కాయలు, పిందెలు,పూత రాలిపోయింది. దీనితో పాటు లేత దశలోని టమోటా ముక్కలకు పలు తెగుళ్ళు సోకడంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. టమోటా ధరలు గత కొన్ని రోజులుగా ఆశాజనకంగా అండగా వర్షంతో పంట నష్టం జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మిరప పంటకు కాయలపై కుళ్ళు తెగులు సోకడంతో పంట చాలావరకు దెబ్బతింది. సీజనల్ పంట అయిన అనప పంట ముసుగు వర్షంతో చీడ పీడలు సోకి పూత రాలిపోయింది. అలాగే కొత్తిమీర, కాలిఫ్లవర్ , బంతి పూలు పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలు మరో రెండు రోజుల కొనసాగితే కోతకు సిద్ధంగా ఉన్న వారి పంట కూడా దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Reporter
Namitha News