నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 22 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీ నందు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వారు ఇంటర్ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ సెల్ వారి ఆధ్వర్యంలో వ్యాల్యూ చైన్ ఆక్టివిటీస్ ఎగ్జిబిషన్ అనే అంశం పై విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ శ్రీమంత బసు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక వస్తువును మార్కెట్లోకి తీసుకురావడంలో నాణ్యత, ధర, వినియోగదారునికి చేరే వేగం వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి తీసుకోవలసిన నూతన వ్యాపార పద్ధతులు మరియు వ్యూహాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని అన్నారు. పరిశ్రమ స్థాపనకు అవసరమైన ముడిసరుకు లభ్యత, తయారీ ప్రక్రియ, తీసుకోవలసిన జాగ్రత్తలు, మార్కెట్ అవసరాలు, అమ్మకాల వ్యూహాలు వంటి విషయాలను చిత్రాలు మరియు మోడళ్ల ద్వారా విద్యార్థులు వివరించారు. డైరీ, సిమెంట్, పెట్రోలియం, ఆయిల్, జ్యువెలరీ, టెక్స్టైల్, పేపర్, టీ వంటి ఎనిమిది పరిశ్రమల ఆధారంగా వాల్యూ చైన్ ప్రాసెస్‌ను ప్రదర్శించారు. అదేవిధంగా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో ఉపయోగపడే ఆధునిక సాంకేతిక పద్ధతులపై కూడా అవగాహన పొందారు. డీన్ స్కూల్ ఆఫ్ మానేజ్మెంట్, డాక్టర్ భాను శ్రీ రెడ్డి మాట్లాడుతూ వాల్యూ చైన్ ప్రాసెస్ వంటి మెళకువల ద్వారా విద్యార్థులు వ్యాపారవేతలుగా స్వయం సంవృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ & అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కే.వి. గీతాదేవి, ఐఐసి కోఆర్డినేటర్ డాక్టర్ అరుళ్ కుమార్, డాక్టర్ ఈ.జ్ఞానప్రసూన, శ్రీకాంత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News