నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఈనెల 7న జిల్లా నిఘా,పర్యవేక్షణ కమిటీ సమావేశం - జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ,సాధికారత అధికారి దామోదర్ రెడ్డి వెల్లడి మదనపల్లె : ఈనెల 7వ తేదీ సోమవారం మదనపల్లె కలెక్టరు వారి కార్యాలయం మినీ కాన్ఫెరెన్స్ హాలు నందు సాయంత్రం 5.30 గంటలకు జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశమును (డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్) అన్నమయ్య జిల్లా కలెక్టరు వారి అధ్యక్షతన నిర్వహించబడునని జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ మరియు సాధికారత అధికారి దామోదర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కావున జిల్లాలోని జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సభ్యులు (డీవీఎంసీ) మరియు సంబంధిత జిల్లా అధికారులు అందరూ తగిన సమాచార నివేదికలతో సదరు సమావేశానికి తప్పక హాజరు కావలసినదిగా ఆ ప్రకటనలో కోరారు.
Reporter
Namitha News