Friday, 19 June 2026 05:08:42 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

నెరవేరబోతోన్న పుంగనూరు యువత చిరకాల కోరిక

పట్టణంలో క్రీడా మైదానానికి రంగం సిద్ధం - ఇంచార్జి సిరివేలు గంగాధర్ @ చిన్నా రాయల్

Date : 20 April 2026 11:43 PM Views : 224

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ​పుంగనూరు - ఏప్రిల్ 20 : జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహిస్తున్న 'జనవాణి' కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా పుంగనూరు పట్టణ యువత నుంచి వచ్చిన ప్రధాన విన్నపం - పట్టణంలో ఒక అధునాతన క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని. ​యువత కోరికపై తక్షణమే స్పందించిన పుంగనూరు జనసేన ఇంచార్జ్ చిన్న రాయల్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా అసోసియేషన్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఆయన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర క్రీడల అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ క్రికెట్ విజయ్ కుమార్ గారు సోమవారం పుంగనూరులోని శుభారం కళాశాల మైదానాన్ని స్వయంగా పరిశీలించారు. ​ఈ సందర్భంగా విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, మైదానం ఏర్పాటుపై త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసి, పనులకు శ్రీకారం చుడతామని భరోసా ఇచ్చారు. యువతకు మెరుగైన క్రీడా వసతులు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు, "యువత కోరికను తీర్చడం నా బాధ్యత, త్వరలోనే పుంగనూరు ఆటగాళ్లకు సొంత మైదానం అందుబాటులోకి వస్తుంది" చిన్న రాయల్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: