Monday, 14 September 2026 07:44:34 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

AISF జిల్లా స్థాయి శిక్షణా తరగతుల కరపత్రాల విడుదల

జూన్ 6, 7వ తేదీ లలో జిల్లా స్థాయి లో శిక్షణ తరగతులు

Date : 27 May 2026 08:08 PM Views : 174

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట -మే 27 : బి.కొత్తకోటలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) ఆధ్వర్యంలో మదనపల్లె లో నిర్వహించనున్న జిల్లా స్థాయి విద్యా,వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతుల కరపత్రాలను AISF జిల్లా కార్యదర్శి కె. మాధవ్ విడుదల చేశారు. ఈ శిక్షణా తరగతులు జూన్ 6,7 తేదీలలో జరగనున్నట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థి ప్రతినిధులు,నాయకులు పాల్గొని విద్యారంగ సమస్యలు,నూతన విద్యావిధానం, విద్యా రంగ కార్పొరేటీకరణ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు వంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విద్యను కార్పొరేట్ శక్తుల ఆధీనంలోకి నెట్టే విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థుల్లో చైతన్యం కల్పించడమే శిక్షణా తరగతుల ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. అదేవిధంగా దేశంలో, రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, యువతను మత్తు పదార్థాల బారిన పడేస్తున్న పరిస్థితులపై కూడా ఈ శిక్షణా తరగతుల్లో విస్తృత చర్చ జరగనుందని తెలిపారు. సమాజంలో పెరుగుతున్న సామాజిక సమస్యలపై విద్యార్థి యువత చైతన్యవంతంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. యువతను చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచి, శాస్త్రీయ దృక్పథంతో సమాజ నిర్మాణంలో భాగస్వాములను చేయడంలో AISF కీలక పాత్ర పోషిస్తుందని నాయకులు పేర్కొన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతం, జిల్లాలో విద్యా వసతుల విస్తరణ కోసం AISF మరింత ఉద్యమాత్మకంగా పనిచేస్తుందని నాయకులు తెలిపారు. ఈ శిక్షణా తరగతులు భవిష్యత్ విద్యార్థి ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో AISF తంబళ్లలపల్లి నియోజకవర్గ కార్యదర్శి డి.తరుణ్,నాయకులు మోహన్,మస్తాన్ విద్యార్థులు పవిత్ర, మౌనిక,వికాస్,రెడ్డి శేఖర్,కార్తీక్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :