నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కలెక్టర్ సారూ కనుకరించండి - నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి - పీజీఆర్ఎస్ లో వృద్ధురాలు కొండామర్రి లక్ష్మమ్మ వినతి మదనపల్లె : కలెక్టర్ సారూ కనుకరించండి అంటూ డోర్ నెంబర్ ఎఎ/27/441 కోళ్లబైలు పంచాయతీ,వైయస్సార్ కాలనీలో నివాసం ఉండే లేట్ కొండామర్రి వెంకటరమణ భార్య కొండామర్రి లక్ష్మమ్మ సోమవారం పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టరుకి వినతిపత్రం అందజేసింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వేనెంబర్ 665/666లో ప్లాట్ నెంబర్ 11ను ఎ.సుజాత అనే ఆమెకు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.అయితే ఆమె ఈ స్థలంలో ఇళ్లు నిర్మించుకోకుండా మరోచోట నిర్మించుకున్నారని దీంతో ఆ ప్లాటును ప్రభుత్వం వారు 2008లో తనకు కేటాయించారని తెలిపారు.సదరు స్థలంలో తాను ఇళ్లు నిర్మించుకొని చాపల మగ్గం నేసుకుంటూ జీవనం సాగిస్తున్నానన్నారు,ఎఎ/27/441 డోర్ నెంబరుపై విద్యుత్ శాఖ వారు కరెంట్ సర్వీసు ఇచ్చారని,ఇంటి పన్ను సైతం చెల్లించడం జరిగిందన్నారు.ఇటీవల విద్యుత్ కనెక్షన్ తొలగించగా తాను స్థానిక ఎమ్మెల్యేని సంప్రదించగా సత్వరమే స్పందించి విద్యుత్ కనెక్షన్ ఇప్పించి అండగా నిలిచారన్నారు.అయితే గతంలో మంజూరు చేసిన సుజాత కుమారుడు ఈ స్థలం తనదేనంటూ చెబుతున్నాడని,స్థానికంగా కొందరు ఇంటిని ఖాళీ చేయమని పదేపదే ఇబ్బంది పెడుతున్నారని కన్నీరుమున్నీరుగా విలపించింది.నాకు కుమార్తెలు,కుమారుడు ఉన్నప్పటికీ వారు మరోచోట జీవిస్తున్నారని,నాకు దిక్కెవరు లేరని తెలిపారు.కావున ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ స్పందించి తనకు శాశ్వత పరిష్కారం చూపాలని,తన ఇంటి స్థలంపై సర్వహక్కుల కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Reporter
Namitha News