Tuesday, 15 September 2026 08:54:55 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

మిట్స్ లో అంబరాన్ని అంటిన అశ్వ్ 2కె26 కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్

అలరించిన సినీ గాయకులు సాగర్, లిప్సిక భాష్యం మరియు మౌనిక యాదవ్ తదితరలు

Date : 25 March 2026 08:41 PM Views : 268

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 25 : అంగళ్ళు సమీపం లో మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు అశ్వ్ 2కె26- జాతీయ స్థాయి టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ ను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ గాయకులు సాగర్, లిప్సిక భాష్యం మరియు మౌనిక యాదవ్ లు హాజరయ్యారు. కార్యక్రమం లో ఛాన్సల్లర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ ఇలాంటి వేడుకలు విద్యార్థుల జీవితంలో మరిచిపోలేని మంచి జ్ఞాపకాలను ఇస్తాయని తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ముఖ్యంగా బాలికలు ముందుకు వచ్చి మదనపల్లి మరియు సమీప జిల్లాల్లో ఫ్లాష్‌మాబ్ కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల యూనివర్సిటీకి మంచి పేరు వచ్చిందని అన్నారు. 2026లో చదువు పూర్తి చేసి వెళ్లే విద్యార్థులకు ఈ వేడుకలు మంచి జ్ఞాపకంగా నిలవాలని, మొదటి సంవత్సరం విద్యార్థులు సీనియర్ల నుంచి సంప్రదాయాలు, కార్యక్రమాల నిర్వహణ నేర్చుకోవాలని సూచించారు. మిట్స్ యూనివర్సిటీ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చురుకైన క్యాంపస్‌గా గుర్తింపు పొందిందని తెలిపారు. విద్యతో పాటు వినోదం, స్నేహాలు కూడా ముఖ్యమని, కలిసి పనిచేయడం మరియు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందని అన్నారు సింగర్స్ పాడిన పాటలు విద్యార్థులను అలరించాయి. అశ్వ్ కార్యక్రమం సందర్బంగా “రకాసా” సినిమా ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. కార్యక్రమంలో కొణెదల నిహారిక, హీరో సంగీత శోభన్, హీరోయిన్ నయన్ సారిక, డైరెక్టర్ మానస శర్మ, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్, గెటప్ శీను చిత్ర బృందం ట్రైలర్‌ను ఆవిష్కరించి, సినిమా విశేషాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, “రకాసా” సినిమా యూత్‌కు ఆకట్టుకునే విధంగా యాక్షన్, ఎమోషన్ మరియు థ్రిల్లింగ్ అంశాలతో రూపొందించబడిందని తెలిపారు. విద్యార్థులు కూడా ట్రైలర్‌ను ఆసక్తిగా వీక్షించి, హర్షధ్వానాలతో అభినందించారు. కార్యక్రమంలో ప్రో ఛాన్సల్లర్ నాదెళ్ల ద్వారకనాథ్, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్. సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, కన్వీనర్ డాక్టర్ కమల్ బాషా తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక, డ్యాన్స్ మరియు ఇతర కార్యక్రమాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :