నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - జూన్ 24 : ఆత్మకూరు తహసీల్దార్ పద్మజా కుమారి అధ్యక్షతన నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ, ఓటరు జాబితాపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించారు. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు వెరిఫికేషన్‌లో పొరపాట్లు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. 2002 ఓటర్ కార్డు ప్రాతిపదికపై కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. పార్టీల అభ్యంతరాలను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్తామని జరుగుతున్న వెరిఫికేషన్ ప్రక్రియకు అందరూ సహకరించాలని ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావచ్చని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు తహసిల్దార్ అనిల్ తో పాటు నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News