నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 18: ప్రభుత్వం ఆదేశాల మేరకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటాకు సంబంధించిన వివరాలను పట్టణం పరిధిలోని సంబంధిత సచివాలయాల్లో గురువారం అందుబాటులో ఉంచామని తెలియచేసిన పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి. కమీషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని 16 సచివాలయాల్లో డేటా ను ప్రదర్శించారు. ప్రజలు వచ్చి వారికి సంబంధించిన కుటుంబ వివరాలను చూసుకుంటున్నారు. సర్వేలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే శుక్రవారం జరిగే వార్డు సభలో లిఖిత పూర్వకంగా అర్జీలు సమర్పించాలని ప్రజలను కోరారు.
Reporter
Namitha News