నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా.. పుంగనూరు శ్రీ వీరుపాక్షి మారెమ్మ ఆలయం ను ఎండో మెంట్ కానివ్వం...విశ్వాహిందు పరిషత్ సభ్యులు. మారెమ్మ ఆలయ అభివృద్ధి పై కన్నేసిన ఎండో మెంట్.. గుడి లో భక్తులను దోచేందు కె ఎండోమెంట్ చూస్తున్నది. అభివృద్ధి చెందని ఎన్నో పురాతన ఆలయాలు దేవాదాయ శాఖ కు కనపడలేదు.. పుంగనూరు లోని శ్రీ వీరుపాక్షి మారెమ్మ ఆలయం ఏళ్ల తరపడి కొన్ని కుటుంబాలు భక్తులు ఇచ్చిన కానుకలతో అమ్మవారి కి పూజలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆలయం నకు ప్రతి దినం వందలాది మంది భక్తులు రాక పెరగడం తో ఆలయం పై ఎండో మెంట్ కన్ను పడిందని,ఆనాడు ఆలయ అభివృద్ధి కి నోచుకోని ఎండో మెంట్ ఇప్పడు ఆలయం ను తమ చేతుల్లోకి ఎలా తీసుకొంటుందని భక్తులు, ఆర్ పి ఎఫ్ నాయకులు ప్రశ్నించారు. మారెమ్మ అమ్మవారి ఆలయం ను ఎండో మెంట్ కి ఇవ్వడానికి మేము ఎవ్వరు సిద్ధంగా లెమని న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని,నేడు గుడి లో అమ్మవారికి సంబందించి వేలం పాట ను అడ్డుకోవడం జరిగిందన్నారు. పోలీసులు ఆలయ నిర్వాహకులు హైకోర్టు లో కేసు ఉండడం తో వేలం పాట నిర్వహించడానికి వెలులేదని ఎండో మెంట్ అధికారులకు తెలిపారు. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఆలయం ఎండోమెంట్ కి ఇవ్వడాన్ని నిరకరిస్తూ అప్పీల్ వేశామని, కేసు నడుస్తుండగా ఆలయం లో ఎలాంటి వేలం పాట నిర్వహించరాదని తెలిపారు.కార్యక్రమం లో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, ఆర్ పి ఎఫ్ సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Reporter
Namitha News