Sunday, 13 September 2026 07:10:35 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో ఏంట్రాప్రేన్యూర్షిప్ పై అవగాహనా కార్యక్రమం

కేంద్ర సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారం

Date : 13 November 2025 08:30 PM Views : 186

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 13 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం వారు మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వారి సహకారంతో ఎంట్రప్రెన్యూర్షిప్ పై అవగాహన కార్యక్రమాన్నినిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హైదరాబాద్ కు చెందిన నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, డిప్యూటీ మేనేజర్ పి.అబ్దుల్ ఖాదర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేటి వేగవంతమైన సాంకేతిక మరియు ఆర్థిక ప్రపంచంలో, ఉద్యోగాల కోసం ఎదురుచూడటం కంటే స్వయంగా ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం అత్యంత అవసరం అని అన్నారు. ఎం బి ఏ తరువాత చాలా మంది విద్యార్థులు ఉద్యోగం కోసం వెళుతున్నారని, కొద్ది మంది మాత్రమే పరిశ్రమలు పెట్టి జీవనోపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. ఒక పరిశ్రమ ఏర్పాటు చెయ్యాలంటే ఎంటువంటి జాగ్రత్త లు తీసుకోవాలి అనే అంశాలపైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఆర్ధిక పరమైన సహాయసహకారాలు అందిస్తున్నాయని అన్నారు. పరిశ్రమల్లో తయారు చేసే వస్తువు నాణ్యత, మార్కెటింగ్ మరియు వినియోగదారుడి అభిరుచికి తగినట్టు ఎలా తయారు చేసేలా మన ఆలోచన దృష్టిలో పెట్టుకోవాలి అని తెలిపారు. అదే విదంగా మనం తయారు చేసిన వస్తువుకు, మిగతా వాటికీ ఉన్న తేడా కూడా పరిశ్రమ విజయానికి దోహదపడుతుంది అని తెలిపారు. ఏ వ్యాపారం అయిన లాభాల బాటలో ముందుకు వెళ్ళాలి అంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో మన వస్తువు ధర, నాణ్యత ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో డీన్ స్కూల్ అఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి, కో-ఆర్డినేటర్ డాక్టర్ గీత దేవి, ఈడి సెల్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె. శిరీష, కో-కోర్డినేటర్ డాక్టర్ జగన్ నాథ్, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :