నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 18 : అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం కూటమి నాయకుల కృషితో ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు మరమ్మతులు నిలిచిపోయి దుమ్ము ధూళితో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని కూటమి నాయకులకు మొరపెట్టుకున్నారు.ఈ సమస్యకు వెంటనే స్పందించిన జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ని కలసి ప్రజలు పడుతున్న ఇబ్బందులను పది హేను రోజులు ముందే తెలియజేయడం జరిగింది.ప్రజలకు వెంటనే రోడ్డు సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు.కలెక్టర్ వెంటనే స్పందించి నేడు కాంట్రాక్టు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నాయకులు రాయల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రధాన మంత్రి మోడీ,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవణ్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ లు వెంటనే స్పందించి ప్రజల అభివృద్ధి కి కృషి చేస్తున్నందుకు ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.కూటమి నాయకులు గా ప్రజా సమస్య లు నెరవేర్చడం లో ఎల్లప్పుడూ ముందుంటామని పుంగనూరు పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. రోడ్డు నిర్మాణ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు అయూబ్ ఖాన్, నరసింహులు,నానాబాల కుమార్,టిడిపి నాయకులు లక్ష్మణ్ రాజు, నాగరాజా, కాంట్రాక్టర్,కూటమి కార్యాకర్తలు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News