నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 16 : ఇండియన్ బ్యాంక్ ల ఆర్థిక లావాదేవీల తో పాటు అభివృద్ధిలో వెలుగు సంఘమిత్రలదే కీలకపాత్ర ని ఇండియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఇందిర ప్రశంసించారు. సోమవారం వెలుగు కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో వెలుగు సంఘమిత్రల సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తంబళ్లపల్లె, కోసువారిపల్లె ఇండియన్ బ్యాంకుల పరిధిలో మహిళా సంఘాలు రుణాల సద్వినియోగంలో సత్ఫలితాలు సాధించినట్లు చెప్పారు. బ్యాంకు లింకేజీ తో పాటు పలు రకాల రుణాలను అందించడానికి బ్యాంకులు సహకరిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక ఏడాదిలో 33 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ కి వెలుగు ఏపిఎం తోబాటు సీసీలు, వివో లీడర్లు, సభ్యులు, సంఘమిత్రలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా బ్యాంక్ పరంగా మహిళా సంఘాల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకు రుణాలు పంపిణీలో పారదర్శకత పాటించి భవిష్యత్తులో ప్రతి మహిళ లక్షాధికారి కావడమే లక్ష్యంగా తమ సహకారం ఉంటుందన్నారు. ఏపీఎం మాట్లాడుతూ ఇండియన్ బ్యాంక్ లు మహిళా సంఘాలకు అందించిన రుణ సౌకర్యంపై కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో మరింత ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లె, కోసువారిపల్లి మేనేజర్లు ఎస్ ఎన్ డి మంజూర్ ఇలాహి, నాగరాజు, ఐకెపి అధ్యక్షురాలు రామ లక్ష్మమ్మ,సీసీలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, వివో లీడర్లు, సంఘమిత్రలు పాల్గొన్నారు
Reporter
Namitha News