Sunday, 13 September 2026 03:49:39 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

మదనపల్లె నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సిఎం, డిప్యూటీ సిఎం, ఎమ్మెల్యే ఫోటోలు పెడతారు... కానీ రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి పో

Date : 08 November 2025 07:57 AM Views : 148

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సిఎం, డిప్యూటీ సిఎం, ఎమ్మెల్యే ఫోటోలు పెడతారు... కానీ రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి పోటో పెట్టారా....?? ఇది ఎక్కడి పాలనా... రాజంపేట పార్లమెంటు సభ్యులు మిధున్ రెడ్డి మీ దృష్టిలో ప్రజాప్రతినిధి కాదా...?!? ప్రజల చేత ఎన్నుకోలేదా...!?! ఇదేమి కూటమి పాలనా... మదనపల్లె నియోజకవర్గం కోళ్లబైలు పంచాయతీలో ఎటూ చూసిన భూ కబ్జాలే.... బోగస్ పట్టాలు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారు... సామాన్య ప్రజలు వారి బారిన పడి మోసపోతున్నారు.... కోళ్లబైలు పంచాయతీ కోటి సంతకాల రచ్చబండలో వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ విమర్శలు... కూటమి పాలనలో ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ వర్తంచదా, మదనపల్లె నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సిఎం, డిప్యూటీ సిఎం, ఎమ్మెల్యే ఫోటో పెట్టి రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి పోటో ఎందుకు పెట్టలేదని, రాజంపేట పార్లమెంటు సభ్యులు మిధున్ రెడ్డి మీ దృష్టిలో ప్రజాప్రతినిధి కాదా, ప్రజల చేత ఎన్నుకోలేదా అని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ప్రశ్నించారు. కూటమి పాలనలో మదనపల్లె నియోజకవర్గం కోళ్లబైలు పంచాయతీలో ఎటూ చూసిన భూ కబ్జాలు, బోగస్ పట్టాలు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారని, సామాన్య ప్రజలు వారి బారిన పడి మోసపోతున్నారని, కోళ్లబైలు పంచాయతీలో జరిగిన కోటి సంతకాల రచ్చబండలో వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ విమర్శలు గుప్పించారు.‌‌ శుక్రవారం మదనపల్లె మండలం పోతబోలు, కోళ్లబైలు పంచాయతీలలో‌ కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె రూరల్ కోళ్లబైలు పంచాయతీలో ఎటూ చూసిన భూ కబ్జాలు పెరిగిపోయాయని దుయ్యాబట్టారు.‌ బోగస్ పట్టాలు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ‌రాజంపేట పార్లమెంటు సభ్యులు పివి.మిథున్ రెడ్డి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేయకపోవడం కూటమి ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోవడమే అన్నారు. మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అధికార యంత్రాంగం అందుబాటులో వుండే విధంగా, కార్యాలయాలలో పనులు సులభంగా వుండేందుకు గ్రామ సచివాలయ వ్వవస్థ తీసుకువస్తే దానిని నిర్వీర్యం చేసి, ఇప్పుడు పేరు మార్పు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ‌గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లీనిక్, వాలంటీర్లు ఏర్పాటు చేసి, ప్రభుత్వ కార్యాలయాలు కట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి కే దక్కిందని కొనియాడారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో వచ్చే విధంగా ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని PPP విధానంలో చేపట్టాలని కూటమి ప్రభుత్వం చూడటం దుర్మార్గం అన్నారు. మెడికల్ కళాశాలు ప్రయివేటీకరణ తోపాటు మదనపల్లె జిల్లా ప్రభుత్వం హాస్పిటల్ కూడా ప్రయివేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని దీనిని ప్రతిఒక్కరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ‌మరో వైపు రాష్ట్రంలోని నూతన మెడికల్ కాలేజీల PPP విధానంలో చేపడితే పేదలకు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ PPP విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, మీ పిల్లలు డాక్టర్లు కావాలంటే కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ముడుపుల కోసమే మెడికల్‌ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. 17 మెడికల్‌ కళాశాలలు రాష్ట్రానికి తేవడమన్నది ఒక చరిత్ర అని, అది జగన్మోహన్ రెడ్డి సృష్ఠించాడన్నారు. అవి పూర్తయితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కి పేరుప్రతిష్ఠలు వస్తాయో అన్న కుతంత్రంతోనే మెడికల్‌ కళాశాలలను పీపీపీ అంటూ ప్రైవేటు పరం చేసేస్తున్నారన్నారు‌. సంపద సృష్ఠి అంటే వేలల్లో ఖర్చుపెట్టి చదివే విద్యార్థులు లక్షల్లో ఖర్చుపెట్టి చదివేలా చెయ్యడమేనా అని ప్రశ్నించారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ వైద్యశాలల కోసం వైసిపి చేస్తున్న పోరాటంలో ప్రతిఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‌

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :