Sunday, 13 September 2026 09:57:25 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

పుస్తకాల గొడవ - విద్యార్థిపై మరో విద్యార్థి చాకుతో దాడి @ మెడకు 8 కుట్లు

Date : 25 June 2026 06:47 PM Views : 138

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వాల్మీకిపురం : వాల్మీకి పురం పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య పుస్తకాల విషయంలో జరిగిన గొడవ తీవ్ర ఘటనకు దారితీసింది. మండలంలోని గొల్లపల్లికి చెందిన విద్యార్థి హర్షవర్ధన్ పుస్తకాలను పట్టణానికి చెందిన విద్యార్థి భరత్‌రాజ్ దొంగిలించినట్లు సమాచారం. ఈ విషయమై భరత్ రాజ్ ను హర్షవర్ధన్ నిలదీయడంతో ఇద్దరి మధ్య మంగళవారం వాగ్వాదం జరిగింది. బుధవారం ఉదయం భరత్‌రాజ్ రూ.5 వెచ్చించి చిన్న చాకును కొనుగోలు చేసి పాఠశాలకు తీసుకువచ్చాడు. హర్షవర్ధన్ రానీ ఈరోజు వాడి కథ చూస్తానంటూ తోటి విద్యార్థుల వద్ద హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం తరగతి గదిలోకి వచ్చిన హర్షవర్ధన్ పుస్తకాలు కింద పెట్టేందుకు వంగిన సమయంలో భరత్‌రాజ్ చాకుతో హర్షవర్ధన్ మెడపై బలంగా కోశాడు. దీంతో హర్షవర్ధన్ తీవ్రంగా గాయపడి రక్తస్రావం అయ్యింది. అప్రమత్తమైన ఉపాధ్యాయులు, విద్యార్థులు అతడిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెడపై దాదాపు 8 కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాధిత విద్యార్థి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :