Thursday, 30 July 2026 02:32:15 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లో పీహెచ్.డి అడ్మిషన్ లకు ప్రవేశ పరీక్ష

Date : 05 July 2026 07:21 PM Views : 93

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూలై 5 : మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బి యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ విభాగాల కు సంబంధించిన పీహెచ్.డి ప్రవేశ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు 133 మంది అభ్యర్థులు హాజరయ్యారని, పరీక్షను పూర్తిగా పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించడంతో పాటు అభ్యర్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. పరిశోధనకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, అత్యాధునిక ప్రయోగశాలలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, పరిశ్రమలు మరియు ప్రముఖ పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యాలు, ఆధునిక పరిశోధనా మౌలిక వసతులతో మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ పరిశోధకులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట అవకాశాలను అందిస్తోందని తెలిపారు. ప్రవేశ పరీక్ష అనంతరం యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హత మరియు ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు ఉపకులపతి తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షను యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, అసోసియేట్ డీన్ (పీహెచ్.డి ప్రోగ్రామ్స్) డాక్టర్ ఎన్. నంద కుమార్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సాయి కుమార్ పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :