Monday, 14 September 2026 05:25:58 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ విద్యార్థుల ఆత్మీయ సమావేశం

Date : 04 April 2026 10:03 PM Views : 152

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 04 ::అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు నందు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం మరియు మిట్స్ అల్యూమిని వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ నందు 2018 మరియు 2025 సంవత్సరంలో చదువుకున్నపూర్వ విద్యార్థులు హాజరైనారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్ధి సయ్యద్ మాజ్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుత విద్యార్థుల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడంలో అల్యూమిని పోర్టల్ మరియు లింక్డ్ఇన్ వంటి వేదికలు ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు. అల్యూమిని పోర్టల్ ద్వారా పూర్వ విద్యార్థుల వివరాలు ఒకే వేదికలో అందుబాటులో ఉండటంతో, వారితో సులభంగా సంబంధాలు ఏర్పరచుకోవచ్చు అని అన్నారు. ఉద్యోగ అవకాశాలు, ఇంటర్న్‌షిప్‌లు, మెంటారింగ్ వంటి అనేక అవకాశాలు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే లింక్డ్ఇన్ ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలు, ప్రాజెక్టులు, విజయాలను ప్రపంచానికి పరిచయం చేసుకొని, పరిశ్రమ నిపుణులతో నెట్‌వర్క్ పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా విద్యార్థులు తమ కెరీర్ అభివృద్ధిని వేగవంతం చేసుకోవడంతో పాటు భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.నాగ శ్వేతా మాట్లాడుతూ అల్యూమిని మరియు యూనివర్సిటీ మధ్య బలమైన అనుబంధం కొనసాగితే విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని, సమాజానికి ఉపయోగపడే నాణ్యమైన ఇంజినీర్లను తయారు చేయడం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొని తమ అనుభవాలను ప్రస్తుత విద్యార్థులతో పంచుకున్నారు. సంస్థతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, విద్యార్థి దశలో పొందిన విద్య, మార్గదర్శకం తమ వృత్తి జీవితంలో ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డీన్-ఇండస్ట్రీ రేకేషన్స్ డాక్టర్ పి.ఎమ్ బాలాజీ, డాక్టర్ ఏ వి పవన్ కుమార్, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.నాగ శ్వేతా మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :