Sunday, 13 September 2026 11:57:22 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు

హైదరాబాద్ లో పూర్తి అయిన శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి దశదిన కర్మ కార్యక్రమం - చిత్రపటానికి నివాళులు అర్పించిన తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు, రాజ

Date : 02 May 2026 09:05 PM Views : 232

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : హైదరాబాద్ - మే 02 : న్యాయ కోవిదుడుగా, రాజకీయ, ప్రజా సేవకుడిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుర్తుండిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి దశదిన కర్మ కార్యక్రమం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం జరిగింది. కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారితో ఉన్న పరిచయాలు, స్మృతులను గుర్తు చేసుకున్నారు. గొప్ప రాజనీతిజ్ఞుణ్ణి, మానవతా వాదిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. శ్రీ భాస్కరరావు గారి కుమారుడు ఏపీ ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్ని పార్టీల నుంచి శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారు అందరితో పరిచయాలు ఉన్న వ్యక్తి కావడంతో ఆయనకు నివాళులర్పించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున అభిమానులు, అన్ని పార్టీల కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు శ్రీ పయ్యావుల కేశవ్, శ్రీమతి అనిత, శ్రీ కొల్లు రవీంద్ర, శ్రీ సత్య కుమార్ యాదవ్, శ్రీ టీజీ భరత్, శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీలు శ్రీ పుట్టా మహేష్, శ్రీ కేశినేని శివనాథ్, శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, శ్రీ సాన సతీష్ బాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు శ్రీ కూన రవికుమార్, శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, శ్రీ సుజనా చౌదరి, శ్రీ పత్తిపాటి పుల్లారావు, శ్రీ బొమ్మిడి నాయకర్, శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ సుందరపు విజయ్, శ్రీమతి లోకం నాగ మాధవి, శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, శ్రీ పత్సమట్ల ధర్మరాజు, శ్రీ పంచకర్ల రమేష్ బాబు, శ్రీ బత్తుల బలరామ కృష్ణ, శ్రీ పంతం నానాజీ, శ్రీ గిడ్డి సత్యనారాయణ, శ్రీ అరవ శ్రీధర్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్, మాజీ ఎంపీ శ్రీ టి సుబ్బరామిరెడ్డి, తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ శ్రీ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, ఏపీ ఐడీసీ చైర్మన్ శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ, ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తోట సుధీర్, హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డా.హరిప్రసాద్, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ శ్రీ షేక్ రియాజ్, అహుడా చైర్మన్ శ్రీ టి సి వరుణ్, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు, శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, శ్రీ టీజీ వేంకటేష్, సిపిఐ నాయకుడు శ్రీ నారాయణ, ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ చీఫ్ శ్రీ మహేష్ చంద్ర లడ్డా, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ గోపీనాథ్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శ్రీ కన్నబాబు, శ్రీమతి సృజన, సినీ పరిశ్రమ నుంచి శ్రీ అల్లు అరవింద్, శ్రీ విశ్వ ప్రసాద్, శ్రీ తనీష్, శ్రీ ఆర్కే నాయుడు, శ్రీ బన్నీ వాస్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీ కొటికలపూడి చినబాబు, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ శంకర్ గౌడ్, జనసేన పార్టీ హైదరాబాద్ నగర అధ్యక్షులు శ్రీ రాధారం రాజలింగం, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు నివాళులు అర్పించారు.

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :