Thursday, 30 July 2026 02:32:45 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ విద్యార్థులకు ప్లేస్‌మెంట్ ఎక్సలెన్స్ కోసం ముందస్తు ప్రణాళికా వ్యూహాల పై అవగాహన

Date : 14 February 2026 07:21 PM Views : 104

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 14 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం వారు మిట్స్ ఐ.ఎస్ టి ఈ స్టూడెంట్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం “ప్లేస్‌మెంట్ ఎక్సలెన్స్ కోసం ముందస్తు ప్రణాళికా వ్యూహాలు” అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చెన్నైకి చెందిన రాంపెక్స్ టెక్నాలజీస్, టెక్నికల్ ట్రైనర్-హెడ్ ఏ.ఎమ్ విగ్నేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్లేస్‌మెంట్ ప్రణాళికలు మొదటి సంవత్సరం నుంచే ప్రారంభించడం ఎంత ముఖ్యమో వివరిస్తూ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, సమస్య పరిష్కార సామర్థ్యం, వ్యక్తిత్వ వికాసం, రెజ్యూమే తయారీ విధానం, మాక్ ఇంటర్వ్యూల ప్రాధాన్యం, గ్రూప్ డిస్కషన్‌లో ఆత్మవిశ్వాసంతో పాల్గొనడం వంటి విషయాలను విద్యార్థులకు వివరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, ఆన్‌లైన్ కోర్సులు మరియు సర్టిఫికేషన్ల ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, నెట్‌వర్కింగ్ ప్రాధాన్యం వంటి అంశాలపై స్పష్టతనిచ్చారు. క్రియేటివ్ గా ఆలోచించడం, ఇతరుల భావాలను అర్థం చేసుకోగలగడం, స్థిరంగా నిర్ణయాలపై నిలబడటం లాంటివి మన వ్యక్తిత్వాన్ని మరింత ధృడంగా మారుస్తాయి అని, సక్సెస్ ఎక్కువ కాలం నిలవడానికి ఇవి చాలా ముఖ్యం అని అన్నారు. వాస్తవ ప్రపంచ ప్లేస్‌మెంట్ వ్యూహాలు కెరీర్ విజయానికి కీలకమైనవి అని, విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవం, నైపుణ్య అభివృద్ధి మరియు విలువైన పరిశ్రమ సంబంధాలు పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్‌ కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎమ్. శ్రీ దేవి, అసిస్టెంట్-డీన్ డాక్టర్ కే.చంద్ర మోహన్, కోఆర్డినేటర్స్ డాక్టర్ ఆర్.సుధాకర్, డాక్టర్ జి అరుణ్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :